Child Artist:సినీ ఇండస్ట్రీలో బాల నటుల నుండి హీరోలుగా పరిచయమైన నటులు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం ఆ హీరోలే యంగ్ హీరోలుగా టాలీవుడ్ లో తెగ జోరందుకుంటున్నారు. బాల నటుల నుండి స్టార్ హీరోలుగా మంచి గుర్తింపును కూడా అందుకున్నారు. ఇక కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడిప్పుడు సినిమాల్లోకి అడుగు పెడుతున్నారు.

మరికొంతమంది మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ అనే పేరుతోనే నిలిచిపోయారు. హీరోలుగా మారడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఒకరు డార్లింగ్ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఇందులో ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ నటించగా.. కాజల్ కు తమ్ముడిగా చైల్డ్ ఆర్టిస్ట్ నటించిన సంగతి తెలిసిందే. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరే గౌరవ్. ఆ సినిమాలో గౌరవ్ తన డైలాగులతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో నటించాడు గౌరవ్. శ్రీరామరాజ్యం సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
గౌరవ్ కు తన చిన్నప్పుడే యాక్టింగ్ అన్న, డాన్స్ అన్న చాలా ఇష్టమట. దాంతో చిన్నప్పుడే తను ఎన్నో స్టేజ్ షోలు కూడా చేశాడట. గౌరవ్ మొదటి సారి నందితాదాస్ దర్శకత్వంలో వచ్చిన ఒక డాక్యుమెంటరీలో నటించాడు. ఆ తర్వాత రవితేజ నటించిన బలాదూర్ సినిమాలో కూడా నటించాడు. అలా దాదాపు 20కి పైగా సినిమాల్లో నటించాడు.
హీరో కావాలనుకుంటున్న గౌరవ్..
ఇక ఇప్పుడు గౌరవ్ చాలా పెద్దవాడిగా అయ్యాడు. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఆయనకు సంబంధించిన ఫోటోలను కూడా బాగా పంచు కుంటూ ఉంటాడు. ఇక ఈయనకు హీరో కావాలి అనే కోరిక ఉందట.


































