ఒకే వేదికపై సందడి చేయనున్న బాలయ్య, ఐకాన్ స్టార్!

0
22

టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకు పోతున్నారు. ఈ వయసులో కూడా అదే రీతిలో సినిమాలు చూస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో వస్తున్న అఖండ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్,సాంగ్స్, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వచ్చింది. ఈ సినిమాలో శ్రీకాంత్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 2న గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27న సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరగనుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్యఅతిథిగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. బాలకృష్ణ, అల్లు అర్జున్ ఒకే వేదిక పైకి కనిపించబోతుండడంతో అల్లు అర్జున్ అభిమానులు, బాలయ్య అభిమానులు ఖుషి అవుతున్నారు.ఇప్పటికే తమన్ కంపోజిషన్ లో విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఇటీవల రిలీజైన ట్రైలర్ ను చూసి ప్రేక్షకులు ఈ సినిమాపై మరింత అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ బోయపాటి కాంబోలో ఇదివరకు సింహా, లెజెండ్ లాంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here