కరోనా వేళ డాక్టర్, కాంపౌండర్ కలిసి నీచమైన పని..!

0
234

భారతదేశంలో ఏర్పడిన ఈ విపత్కరమైన పరిస్థితులలో కొందరు సరైన సమయంలో ఆక్సిజన్ అందక మరణించగా మరికొందరు వైద్యుల నిర్లక్ష్యం వల్ల, వారి స్వార్థానికి ప్రాణాలు వదులుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ పరిస్థితులలో ఆక్సిజన్, రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్లు దొరకక ప్రాణాలు కోల్పోతుంటే ఇదే అదునుగా చూసుకొని ఒక ప్రైవేట్ డాక్టర్ కాంపౌండర్ ఇంజెక్షన్ ల విషయంలో చేతివాటం ప్రదర్శించారు.

ప్రస్తుతమున్న కష్టకాలంలో రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్లను అమృతంగా భావిస్తున్నారు.అయితే ఈ విలువైన ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ దందాలు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.నిజామాబాద్‌లో ఒక ప్రైవేట్ డాక్టర్, కాంపౌండర్ ఇద్దరు కలిసి ప్రాణాలు నిలబెడుతున్న ఈ రెమ్‌డిసివర్ డ్రగ్‌లో సెలైన్ వాటర్ నింపి అమ్ముతున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

ఎంతో విలువైన రెమ్‌డిసివర్ వాడి పడేసిన బాటిళ్లలో సెలైన్ వాటర్ నింపి బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. ఈ ఇంజక్షన్ దొరకక ఇబ్బందులు పడుతున్న బాధితులే లక్ష్యంగా వారు ఈ దందా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితుల నుంచి వేలకు వేలు డబ్బులు తీసుకుంటున్నట్లు పోలీస్ అధికారుల దృష్టికి రావడంతో వారు వెంటనే రంగంలోకి దిగి ఈ విధమైనటువంటి దందా నిర్వహిస్తున్న ప్రైవేట్ డాక్టర్, కాంపౌండర్ ను అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here