మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ లోని ఉమర్గాకు చెందిన ధోత్రే కుటుంబం 20 గాడిదలను పెంచుతూ లీటరు గాడిద పాలను రూ. 10 వేలకు అమ్ముతున్నారు. గాడిద పాలకు ఇంత డిమాండ్ ఉండటానికి గల కారణం ఏంటంటే.. ఒక్క గాడిద పాలలోనే కాదు.. పాలల్లో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. అయితే ఈ గాడిద పాలల్లో అన్నింటికంటే ఎక్కవ విశేష గుణాలున్నాయని అంటున్నారు సైంటిస్టులు. జన్యుపరమైన, వైరల్ సంబంధిత సమస్యలకు గాడిద పాలు చక్కని పరిష్కారాన్ని సూచిస్తాయని తెలిపారు.గాడిద పాలతో ఔషధాలే కాకుండా బ్యూటీ ఉత్పత్తులను కూడా రూపొందిస్తున్నారు.

మహారాష్ట్ర మరియు కేరళలలో గాడిద పాల ఉపయోగాల గురించి చేసిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గాడిద పాలను తాగడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని.. దగ్గు, జలుబు, ఆస్తమా, గొంతు ఇన్ఫెక్షన్, టీబీ తదితర వ్యాధుల నివారణలో గాడిదపాలు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.
కేరళలోని కొచ్చీకి చెందిన ఏబీ బేబీ… గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులు రూపొందించి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. అలా ఏడాదికి రూ. 20 లక్షలకుపైగా సంపాదిస్తున్నారు. ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాతనే వీళ్లు ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ సౌందర్య ఉత్పత్తులకు మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది. అంతే కాకుండా వీటి ధర కూడా ఎక్కువగానే ఉంది.
లిప్ బామ్‌లు, బాడీ లోషన్లు, సబ్బులు మొదలగునవి తయారీలో ఈ గాడిద పాలను ఉపయోగిస్తున్నారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్‌కు(షోలాపూర్) చెందిన ఆరుగురు విద్యార్థులు గాడిద పాలతో బ్యూటీ ప్రొడక్ట్స్ రూపొందిస్తున్నారు. చిన్న పిల్లలకు ఎంతో బలాన్ని ఇస్తాయట. అంతేకాకుండా ఒక్కో గాడిద రోజుకు 200 నుంచి 250 మిల్లీ లీటర్ల పాలను ఇస్తుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.































