ఆకు కూరలను కొంటున్నారా… జాగ్రత్త ఇలా కూడా మోసం చేస్తారు..!

0
381

సాధారణంగా మనం మార్కెట్ కి వెళ్ళినపుడు ఆకు కూరలు ఎంతో ఫ్రెష్ గా కనిపిస్తే వాటిని కొనకుండా ఇంటికి వెళ్ళము. మార్కెట్లో ఎంతో ఫ్రెష్ గా కనిపించే ఆకుకూరలను ఇంటికి తెచ్చుకొని అవి అంతే తాజాగా ఉండాలని వాటిని పాలిథిన్ కవర్లో పెట్టి ఫ్రిజ్లో నిల్వ ఉంచుకుంటారు. ఫ్రిడ్జ్ లేనివారు తడిగుడ్డలో ఆకుకూరలను నిల్వ చేసుకుంటారు. అయితే ఈ వ్యక్తి ఆకుకూరలను తాజాగా నిల్వ ఉంచడం కోసం చేస్తున్న పని చూస్తే ఎంతో షాక్ అవుతారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి వాడిపోయిన ఆకుకూరలను ఒక రసాయన ద్రావణంలో ముంచి వాటిని తాజాగా చేస్తున్నాడు. వాడిపోయిన ఆకుకూరలను ఆ ద్రావణంలో ముంచగానే అవి ఎంతో తాజాగా మారిపోతున్నాయి.ఈ విధంగా వాడిపోయిన ఆకుకూరలను తాజాగా చేయడంతో ఎంతోమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అంటూ కొందరు కామెంట్లు చేయగా..ఆహార విషయంలో ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఈ విధంగా ఆకుకూరలను రిఫ్రెష్ చేసే లిక్విడ్ వల్ల అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కనుక ఆకుకూరలను కొనుగోలు చేసేవారు వీలైనంతవరకు తగిన జాగ్రత్తలను పాటిస్తూ కొనుగోలు చేయడం మంచిది. కనుక ఇకపై ఆకుకూరలు కొనుగోలు చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటిస్తూ కొనుగోలు చేయడంతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలం