Dr. Gurava reddy : గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రమణ్యం గారు పోస్ట్ కోవిడ్ సమస్యల్తో మరణించారు. ఆయన మరణించి రెండేళ్లు పైనే అయినా కుడా నిత్యం ఏదో ఒక పాట రూపంలో ఇంకా మనల్ని అలరిస్తూనే ఉన్నారు. ఇక ఆయన గురించి మాట్లాడుతూ ఆయన చనిపోక ముందు చివరగా ఏం మాట్లాడారో ప్రాఖ్యత కీళ్ళ సంబంధిత వైద్యలు ఏ వి గురవా రెడ్డి గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

బాలు గారు చివరిసారిగా మాట్లాడింది అదే…
కరోనా సమయంలో బాలు గారు ఈవెంట్ లో పాల్గొనడం వల్ల కరోనా సోకి చెన్నై లో అపోలో హాస్పిటల్ లో చేరి కరోనా నెగెటివ్ వచ్చినా పోస్ట్ కోవిడ్ సమస్యలను కారణంగా మరణించారు. ఆయన చనిపోక ముందు డాక్టర్ గురవారెడ్డి గారితో మాట్లాడారట. అంతా నార్మల్ అయింది ఇక్కడ వైద్యలు ఇంటికి వెళ్ళమన్నారు. కానీ నేనే ఇంకో రోజు ఉండి వెళదామని అనుకుంటున్నాను అని చెప్పారట. ఆయన తన మెడికల్ రిపోర్ట్స్ బ్లడ్ రిపోర్ట్స్ అన్ని కూడా పంపితే చూసి అంతా బాగుందని చెప్పారట గురవారెడ్డి గారు. కానీ అంతలోనే ఇలా అవుతుందని ఎవరూ ఊహించలేదని ఆయన చనిపోవడం పెద్ద లోటు అంటూ ఏమోషనల్ అయ్యారు గురవారెడ్డి గారు. ఆయనతో చాలా ఏళ్ల నుండి అనుబంధం ఉందని ఆయన భార్య రెండు మోకాళ్ళకు ఆపరేషన్ చేసానని ఆ తరువాత పరిచయం స్నేహంగా మారి హైదరాబాద్ వస్తే నన్ను కలిసి మాట్లాడేవారని సరదాగా ఉండేవారని తెలిపారు.

ఇక మళ్ళీ బాలు గారి ఆత్మ చరణ్ లోకి ప్రవేశ్నించిందా అన్నట్లుగా ‘సీతారామం’ లో పాట పాడారంటు చరణ్ ను ప్రశంసించారు. ఇక గరికపాటి, చిరంజీవి ఇష్యూ గురించి మాట్లాడుతూ నాకు ఈ ఇష్యూ విన్నాను కానీ పూర్తిగా తెలియదు, కానీ చిరంజీవి గారు చాలా మంచి వ్యక్తి, ఒకరిపై త్వరగా కోపం తెచ్చుకోరు. ఆయన ఇంటికి వెళితే మనం కూర్చుంటేనే ఆయనా కూర్చుంటారు, వెళ్ళేటపుడు గేట్ వరకు వచ్చి సాగనంపుతారు అంటూ చెప్పారు. ఇక గరికపాటి గారు పరిచయం ఉంది, ఆయన గొప్ప ప్రవచన కర్త. ఇద్దరూ గొప్పవాళ్లే, వారి మధ్య ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం దీన్ని ఇంతటితో వదిలేస్తే బాగుంటుంది అంటూ చెప్పారు.



































