ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడటం కోసం అనేక కంపెనీలు వ్యాక్సిన్ కని పెట్టాయి. ఈ క్రమంలోనే భారత రక్షణ అభివృద్ధి సంస్థ DRDO… రెడ్డిస్ ల్యాబరేటరీ తో కలిసి 2-డియోక్సీ-D-గ్లూకోజ్ (2-DG) మందును ఉత్పత్తి చేసింది. అయితే ఈ మందు పై ఎన్నో ప్రయోగాలు నిర్వహించగా కరోనా సోకిన వారిలో ఇది సత్ఫలితాలనిస్తుందని తేలడంతో ఈ మందును వచ్చే వారంలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

ఈ 2-డియోక్సీ-D-గ్లూకోజ్ మందును కరోనా తీవ్రత అధికంగా ఉన్న పేషెంట్లకి ఇవ్వడం ద్వారా వారు వ్యాధి నుంచి తొందరగా కోలుకుంటున్నట్లు తేలింది. ఆక్సిజన్ తో చికిత్స పొందే వారిలో కూడా ఈ మందులు వాడటం వల్ల ఆక్సిజన్ అవసరం ఎక్కువ రోజులు లేకుండానే నయమవుతుందని DRDO తెలిపింది.
ఈ క్రమంలోనే మొదటి బ్యాచ్‌లో 10,000 డోసుల 2-DGని కరోనా సోకిన పేషెంట్లకు వచ్చేవారం ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని DRDO అధికారులు స్వయంగా ANI న్యూస్ ఏజెన్సీకి తెలిపారు. ఈ క్రమంలోనే ఈ మందును అధిక సంఖ్యలో ఉత్పత్తి చేయడానికి ఫార్మా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ మందును డాక్టర్ అనంత నారాయణ భయ్ సహా… కొంతమంది DRDO సైంటిస్టులు కలిసి తయారుచేశారు.
ఈ 2-డియోక్సీ-D-గ్లూకోజ్ ను టీకా రూపంలో, టాబ్లెట్ల రూపంలో ఉండదు. ఈ మందు కేవలం పొడి రూపంలో మాత్రమే లభ్యమవుతుంది. ఈ పొడిని నీటిలో కలుపుకుని తాగడం ద్వారా కరోనా నుంచి మనం విముక్తి పొందవచ్చు.సాధారణ మందులతో తీసుకొనే చికిత్స కంటే దీనిని వాడిన వారు త్వరగా కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపారు.అయితే ఇది సాధారణ కరోనా పేషెంట్లకు కాకుండా వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న పేషెంట్లకు మాత్రమే ఉపయోగించనున్నట్లు తెలిపారు.































