డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 16 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 31,000 రూపాయలు వేతనంగా పొందవచ్చు. ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, మెకానికల్ బ్రాంచ్ లలో చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో స్కాలర్స్ కోసం విడుదలైన ఈ నోటిఫికేషన్ కు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ 16 ఉద్యోగాల భర్తీ కోసం 2021 సంవత్సరం జనవరి నెలలో 4వ తేది నుంచి 11వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ లో అండర్ గ్యాడ్యుయేట్ అభ్యర్థులతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు సైతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డీఆర్డీవో వెబ్ సైట్ లో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలను పొందుపరిచారు. 28 సంవత్సరాల వయస్సులోపు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ఫోటోలు, గుర్తింపు కార్డును తీసుకొని వెళ్లాలి.

ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా అభ్యర్థులు జనవరి 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాల్సి ఉంటుంది. ఏవైనా సందేహాలు ఉంటే 0241 – 2544023 నంబర్ కు కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here