డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం ఆర్థిక ఇబ్బందుల వల్ల టాలెంట్ ఉండి ఉన్నత విద్య చదవలేకపోతున్న విద్యార్థినులకు శుభవార్త చెప్పింది. అమ్మాయిల కోసం 1,86,000 రూపాయల స్కాలర్ షిప్ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డీఆర్డీవో చాలా రోజుల క్రితమే ఈ స్కాలర్ షిప్ కు సంబంధించిన దరఖాస్తు తేదీలను ప్రకటించగా ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.

అయితే ప్రతిభ ఉన్న కొంతమంది విద్యార్థినులు అర్హత ఉన్నా ఈ స్కాలర్ షిప్ ను పొందలేకపోయారని డీఆర్డీవో దృష్టికి రావడంతో ఆ సంస్థ స్కాలర్ షిప్ కు సంబంధించిన నోటిఫికేషన్ గడువును మరోసారి పొడిగించింది. డీఆర్డీవో గడువు పొడిగించడంతో ఈ నెల 31వ తేదీ వరకు విద్యార్థినులకు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. చాలామంది విద్యార్థినులు ఫలితాలు ఆలస్యంగా రావడం వల్ల స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోలేకపోయారు.
గ్రాడ్యుయేషన్ చేస్తున్న 20 మంది విద్యార్థినులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న 10 మంది విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ కు అర్హత పొందవచ్చు. 2020 – 21 విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్థినులు మాత్రమే ఈ స్కాలర్ షిప్ కు అర్హత పొందే అవకాశం ఉందని సమాచారం. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రాడ్యుయేషన్ లో 60 శాతం మార్కులు, జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా గ్రాడ్యుయేషన్ స్కాలర్‌షిప్ కు విద్యార్థినులను ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేషన్ విద్యార్థినులకు రూ.1,20,000 పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థినులకు రూ.1,86,000 స్కాలర్ షిప్ లభిస్తోంది.
































