టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఈ దృశ్యం 1 సినిమా మంచి విజయాన్ని సాధించింది. ప్రేక్షకులు వెంకీ మామ అభిమానులు దృశ్యం 2 సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇందులో రాంబాబు అనే ఒక వ్యక్తి పోలీసుల వేధింపుల నుంచి తన కుటుంబాన్ని ఏవిధంగా రక్షించుకుంటారు. అందుకోసం అతను చేసే పోరాటం ఏమిటి? అన్న అంశంతో తెరకెక్కిన విషయం తెలిసిందే.

ఇక దృశ్యం 2 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మలయాళం బ్లాక్ బస్టర్ దృశ్యం కి సీక్వెల్ గా దృశ్యం 2 సినిమా వచ్చింది. మొదట ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేద్దాం అనుకున్నప్పటికీ చివరికి ఓటీటీ వైపే మొగ్గు చూపారు. ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమాకు జీతు జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇందులో విక్టరీ వెంకటేష్, మీనా, నదియా, నరేష్, కృతిక, ఈస్తర్, అనిల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 25న ఈ సినిమా అమెజాన్ లో విడుదల కానున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ ఆరేళ్లుగా డిపార్ట్మెంట్ ను వేధిస్తున్న ప్రశ్నలివి అంటూ అసహనంగా మాట్లాడటం.. చీకటి జ్ఞాపకాల్లోకి మమ్మల్ని మళ్ళీ రావద్దు అంటూ వెంకటేష్ ప్రాధేయపడం అందరికీ సినిమాపై ఆసక్తిని కలిగేలా చేస్తుంది.
Can the scars of the past ruin their future? In Rambabu's world, reality is stranger than fiction.
— Suresh Productions (@SureshProdns) November 12, 2021
Watch #Drushyam2OnPrime, Nov. 25 only on @PrimeVideoIN
▶️https://t.co/xUM4QUHR3u@VenkyMama #MeenaSagar #JeethuJoseph @aashirvadcinema @antonypbvr @anuprubens #SatheeshKurup pic.twitter.com/LobRGTom4E
ఈ టీజర్ ని బట్టి చూస్తే దృశ్యం 2 సినిమా మరింత ఉత్కంఠను పెంచుతోంది. ఈ టీజర్ ను చూసి ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు చిత్ర బృందం. ఇదివరకే వెంకటేష్ నటించిన నారప్ప సినిమా కూడా అమెజాన్ లో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలోనే వెంకటేష్ దృశ్యం సినిమా మరోసారి ఓటీటీలో విడుదలకి సిద్ధమైంది.
































