తక్షణ శక్తి కావాలనుకునేవారు.. ఈ పండు తినాల్సిందే!

0
228

సాధారణంగా పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత శక్తిని అందిస్తాయని అదేవిధంగా ఆరోగ్యానికి సరిపడా పోషకాలను అందిస్తాయనే విషయం అందరికీ తెలిసినదే. కానీ కొన్ని పండ్లు మనకు కేవలం సీజన్లో మాత్రమే లభిస్తాయి. సీజన్ లతో సంబంధం లేకుండా దొరికే పండ్లలో సపోటా ఒకటని చెప్పవచ్చు.చూడటానికి ఎంతో చిన్నగా ఉన్నప్పటికీ రుచి మాత్రం ఎంతో అమోఘంగా అనిపిస్తుంది. సపోటా పండ్లలో ఎక్కువ శాతం క్యాలరీలను కలిగి ఉండటం వల్ల మనకు శక్తిని ఇవ్వటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సపోటా పండును తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

సపోటా పండులో ఎక్కువశాతం క్యాలరీలు ఉండడంతో పాటు ఎంతో రుచిగా ఉంటాయి. ఇందులోఉండే ఫ్రక్టోస్ శరీరానికి త్వరగా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అందుకోసమే క్రీడాకారులు ఎక్కువగా సపోటా పండ్లు తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల వృద్ధులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. సపోటా పండు వాపు కీళ్ళ నొప్పులను తగ్గించడంలో దోహదపడతాయి.

ఈ పండ్లలో ఎక్కువభాగం యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా లభిస్తాయి.ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవడానికి కాకుండా మన శరీరంలో రక్త హీనత సమస్య నుంచి కాపాడుతాయి. సపోటాలు ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధక సమస్యతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సపోటా పండ్లను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.