Eluru Incident : ఏ కన్న తల్లీ చేయని పని చేసిన మహిళ… రెండో భర్త దగ్గరికి తన కూతుర్లను పంపి…!

0
112

Eluru Incident : మానవజాతి సిగ్గుపడేలా ఏ కన్న తల్లీ చేయకూడని పని ఏలూరులో జరిగింది. కన్నతల్లి అంటే పిల్లలను సంరక్షించుకోవడం కోసం తన ప్రాణాలను సైతం అడ్డుగా పెట్టి పోరాడుతుంది. అలాంటి తల్లి స్థానంలో ఉన్న ఒక మహిళ తన కన్న బిడ్డల్నే భర్త దగ్గరికి పంపింది. భర్తతో కాపురం చేయించి పిల్లల్ని కూడా కనేలా చేసింది. మొత్తం సమాజం సిగ్గుపడేలాంటి ఈ సంఘటన ఏలూరులో జరిగినది.

కూతుర్లతో బిడ్డలను కన్న వరుసకూ తండ్రి అయ్యే వ్యక్తి…

ఏలూరులోని పెదపాడు మండలంలోని ఒక గ్రామానికి చెందిన మహిళ భర్త 2007లో మరణించడంతో బావ వరుస అయ్యే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. మగ బిడ్డను కనాలని లేకపోతే వేరే పెళ్లి చేసుకుంటానని భర్త సతీష్ కుమార్ బెదిరించదంతో అప్పటికే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న మహిళ వయసుకు వచ్చిన తన కూతుర్ల ద్వారా పిల్లల్ని కనమని తన భర్త సతీష్ వద్దకు పెద్ద కూతురుని పంపింది. ఆ అమ్మాయికి పాప పుట్టగా రెండో అమ్మాయిని పంపింది. ఆ అమ్మాయికి బాబు పుట్టాడు. అయితే పుట్టిన బిడ్డ మరణించడంతో ఆ శిశువును మురికి కాలువలోకి పడేసారు. ఆడపిల్లను తమ బిడ్డగా బర్త్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు.

అయితే సతీష్ కి ఆ మహిళకు విబేధాలు రావడంతో సదరు మహిళ కూతుర్లను అక్కడే వదిలి పుట్టింటికి వైజాగ్ వెళ్ళింది. ఇక తెలిసిన వ్యక్తికి చిన్న కూతురు విషయం చెప్పగా బంధువుల సహాయంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇద్దరు మైనర్ బాలికలు సంరక్షణ కేంద్రంలో ఉండగా ఇద్దరూ గర్భవతులు. ఇలా సభ్య సమాజం తలదించుకునేలా చేసిన సతీష్ అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.