Anchor Suma: సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమాలలో క్యాష్ దొరికినంత దోచుకో ఒకటి. గత కొన్ని సంవత్సరాలుగా అత్యంత ప్రేక్షకాదరణ పొంది విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతోంది.ఇకపోతే ఈ కార్యక్రమానికి కొందరు జబర్దస్త్ కమెడియన్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుత కాలంలో ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు వారి సినిమా ప్రమోషన్ల కోసం పెద్ద ఎత్తున బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈవారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా క్యాష్ కార్యక్రమానికి చోర్ బజార్ చిత్ర బృందం హాజరయ్యారు. హీరో ఆకాష్ పూరి, హీరోయిన్ గెహ్నా సిప్పి, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్, రచ్చ రవి హాజరయ్యారు. ఇక వీరిపై సుమ ఎప్పటిలాగే తనదైన శైలిలో పంచుల వర్షం కురిపించగా ఇమ్మానియేల్ సైతం సుమను ఓ రేంజ్ లో ఆడుకున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుమ వీరితో కలిసి టాస్క్ చేయించారు. ఈ టాస్క్ లో భాగంగా హీరోయిన్ ఎంట్రీ ఇవ్వగానే సెల్ఫీ కోసం అభిమానులు ఎలా ఎగబడతారో చూపించారు. హీరోయిన్ గెహ్నా సిప్పీ తన ఒరిజినల్ క్యారెక్టర్ లోకి రాగ రవి, ఇమ్మానియేల్ బౌన్సర్ గా ఉన్నారు. ఇక తనతో సెల్ఫీ దిగడం కోసం సుమ, ఆకాష్ పోటీపడ్డారు.
ముసలావిడ అంటూ సుమను అవమానించిన ఇమ్మానియేల్…
చాలాసేపటి నుంచి తనకోసం తనతో సెల్ఫీ దిగడం కోసం వెయిట్ చేస్తున్నాను ఒక సెల్ఫీ అంటూ బ్రతిమలాడుతాడు. అదే సమయంలో కూడా సెల్ఫీ కోసం ప్రయత్నం చేస్తుండగా ఇమ్మానుయేల్ పాపం ముసలావిడ చాలాసేపటి నుంచి మీతో సెల్ఫీ దిగడం కోసం ఎదురుచూస్తుంది అంటూ సుమను ఉద్దేశించి అంటాడు.ఇలా సుమని ముసలావిడ అనడంతో చిర్రేత్తుకొచ్చిన సుమ ఏకంగా ఇమ్మానియేల్ ఫోన్ తీసుకొని బండకేసి కొట్టింది. అయితే అది నిజమైన ఫోనా లేక డమ్మీ ఫోనా అనే విషయం తెలియాల్సి ఉంది.





























