Indian Idol 9 Winner: లొల్ల వెంకట రేవంత్ కుమార్ శర్మ అలియాస్ రేవంత్. ఇతడు ఒక ప్లేబ్యాక్ సింగర్. తెలుగు భాషలో తన పాటలకు ప్రసిద్ధి చెందాడు. అతడు తెలుగు, కన్నడ చిత్రాలకు దాదాపు 200 పాటలకు పైగా పాడారు. ఇక దేశవ్యాప్తంగా సింగర్స్ కు ఎంతో ప్రాముఖ్యత ఉన్న షో.. ఇండియన్ ఐడల్.

ఈ ఇండియన్ ఐడల్ లో నే బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్ 5 విజేతగా నిలిచి బిగ్ బాస్ లోకి వెళ్లాడు. ఇక రేవంత్ కూడా 9వ సీజన్ లో ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుచుకున్నాడు. అతడు బాహుబలి: ది బిగినింగ్ చిత్రంలోని ” మనోహరి ” పాట పాడాడు. దీనికి గాను అతడికి IIFA ఉత్సవాల్లో ఉత్తమ నేపథ్య గాయకునిగా స్టార్ మా మ్యూజిక్ అవార్డు ను అందుకున్నాడు.

ఇక 2010లో అతడు సూపర్ సింగర్ 5 మ్యూజిక్ షో తో మొదలైన అతడి ప్రయాణం.. సీటీమార్ చిత్రంలోని సీటీమార్ టైటిల్ సాంగ్ వరకు సాగింది. ఇంకా అతడు ఎన్నో పాటలను తన గాత్రంతో వినిపిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా.. అతడికి గురించి తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. అతడు ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
ఇన్ స్టాలో ఫొటోలు వైరల్..
దానికి సంబంధించి ఫొటోలను అతడు ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేశాడు. కాబోయే భార్య పేరు అన్వితగా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డిసెంబర్ 24న ఆమెతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. దీంతో ఎంతో మంది సెలెబ్రిటీలు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
































