అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకుల తర్వాత వీళ్లపై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. సమంత మాత్రం కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. నాగ చైతన్య హీరోగా ఇటీవల విడుదలైన లవ్ స్టోరీ సినిమాతో మంచి ఉత్సాహంతో ఉన్నాడు. ఇక గత నెల రెండు నెలల నుంచి వీళ్లిద్దరు వార్తలలో నిలుస్తూ వస్తున్నారు. చై తో విడిపోయిన దగ్గరనుంచి సమంత చేసే పనులు కొద్దిగా బాధను తెలియజేస్తున్నాయి.

పెళ్లి గురించి, జీవితం గురించి ఆమె పెట్టే పోస్టులు ఆమె చై ని ఎంత మిస్ అవుతుందో తెలియజేస్తున్నాయని అభిమానులు చెబుతున్నారు. సమంత సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టులు పెడుతూ అభిమానులతో ముచ్చటిస్తుంటే.. చైతన్య మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు.
ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 2017 లో నాగ చైతన్య – అనుష్క ఎంగేజ్‌మెంట్ కి సంబంధించిన పలు వార్తలు రాగా, దానిపై నాగార్జున రియాక్ట్ అయ్యారు. త్రోబాక్ ఇంటర్వ్యూలో నాగార్జున అక్కినేని రూమర్స్ ఎలా స్పందించారో షేర్ చేసుకున్నారు. చైతూ.. నీకు అనుష్కశెట్టికి ఎంగేజ్ మెంట్ అయిదంటగా.. అని చైతన్యకు ఉదయం ఫోన్ చేసి చెప్పాననని.. తాను ఆ సమయంలో స్విట్జర్లాండ్‌లో షూటింగ్ లో ఉన్నానన్నాడు.
నాకు కూడా చెప్పలేదు చైతూ అని అడిగితే.. అవును నిజమే.. అని బిగ్గరగా నవ్వాడు.. అని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత నేను అనుష్కని కూడా పిలిచి అడిగా. అందరం బాగా నవ్వుకున్నాము అని అన్నారు నాగార్జున. ఇదంతా ఎవరో ఒక నిర్మాత కావాలని రూమర్స్ క్రియేట్ చేశారని అనుష్క చెప్పిందన్నారు.































