సాధారణంగా కొందరు గుప్తనిధుల వేటలో పడి పెద్దఎత్తున తవ్వకాలను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరికీ తెలియకుండా క్షుద్రపూజలు చేస్తూ గుప్త నిధుల తవ్వకాలను ప్రారంభించారు. గుప్త నిధుల తవ్వకాల ముఠా పై అనుమానం వచ్చి నిఘాలో ఉంచిన పోలీసులు ఎట్టకేలకు గుప్తనిధుల వేటగాళ్లును అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళితే…

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కన్నెపల్లిలో గుప్త నిధుల కలకలం చెలరేగింది. గుప్తనిధుల కోసం గత కొద్ది రోజులుగా క్షుద్ర పూజలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే నిందితుల నుంచి ఒక ఆటో, సెల్ ఫోన్లు, క్షుద్రపూజల ఉపయోగించే పూజా సామాగ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది తవ్వకాలు చేపడుతున్నారు అనే సమాచారం అందడంతో పూర్తిగా నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు తాళ్ల రెబ్బన గ్రామ శివారులోని నెన్నెల – కన్నేపల్లి రహదారిలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఆటోను ఆపి తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది.
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారించగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని కొంచవెళ్లి మహేష్ అనే వ్యక్తి ఇంట్లో గుప్తనిధుల తవ్వకాలు చేయడానికి వెళుతున్నట్లు నిందితులు తెలిపారు. ఈ క్రమంలోని వారి దగ్గర ఉన్న సెల్ఫోన్లు తీసుకుని పోలీసులు ఎంక్వైరీ చేయగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
గత కొంత కాలం నుంచి వివిధ ప్రాంతాలలో గుప్తనిధుల తవ్వకాలు చేపట్టడం కాకుండా కన్నెపల్లి మండలం వెంకటాపూర్ అటవీ ప్రాంతంలో కూడా తవ్వకాలు చెప్పినట్టు సెల్ఫోన్ వీడియో ఆధారంగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనలో భాగంగా నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.































