బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త గా గుర్తింపు పొందిన రాజ్ కుంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్ని రోజులు వరకు రాజ్ కుంద్రా ఒక వ్యాపారవేత్తగా చలామణిలో ఉన్నారు. అయితే ఆ వ్యాపారాలు వెనుక భారీ కుంభకోణం ఉందని తాజాగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రా ఫోర్న్ సినిమాలను షూట్ చేస్తూ వాటిని యాప్ లో అప్ లోడ్ చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన అధికారులు తనని కస్టడీలోకి తీసుకున్నారు.

ప్రముఖ బిజినెస్ మెన్ ఈ విధంగా అరెస్టు కావడంతో బీ టౌన్ లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పోలీసులు అతన్ని విచారించగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వెస్ట్ ముంబైలో ఓ బిల్డింగ్ లో పోర్నోగ్రాఫిక్ కి పాల్పడినట్లు గుర్తించారు.
ఈ విధంగా రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన పోలీసులు అతడిపై వివరాలను కూడా తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అతని బ్యాంక్ డీటెయిల్స్ చూసి అధికారులు ఎంతో ఆశ్చర్యపోయారు. రాజ్ కుంద్రా పోర్నోగ్రాఫిక్ ద్వారా రోజుకు లక్ష నుంచి పది లక్షల వరకు డబ్బు సంపాదిస్తున్నారని తెలియడంతో అధికారుల మైండ్ బ్లాక్ అయింది.
ఈ కేసు విషయమై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రాను ఈ నెల 23న కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ క్రమంలోనే గత 10 సంవత్సరాల క్రితం రాజ్ కుంద్రా పోర్న్ VS ప్రాస్టిట్యూషన్ అంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.