Connect with us

Health News

వాల్నట్స్ వలన ఇన్ని లాభాలున్నాయా.?

Published

on

మంచి ఆహారాన్నిప్రతిరోజూ తీసుకుంటూ ఉంటె మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. పోషక విలువలు ఎక్కువ ఉండే ఆహారాన్ని శరీరానికి తగిన మోతాదులో అందిస్తుంటే ఎంతో మేలు జరుగుతుంది. చిన్నపిల్లలు వాల్నట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఇవి పిల్లల ఎదుగుదలకి ఎంతో దోహదపడతాయి. ఒక ఔన్సు వాల్నట్స్‌లో 4 గ్రాముల ప్రోటీన్లు, 2 గ్రాముల ఫైబర్, ఇంకా మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం, విటమిన్-బీ లాంటి విలువైన ఖనిజాలు ఎన్నో ఉంటాయి. అంతేకాకుడా ఎంయూఎఫ్ఐ, ఓమేగా-3 లాంటి ఫ్యాటీ ఆమ్లాలు కూడా వీటిలో పుష్కలంగా లభిస్తాయి. వాల్ నట్స్ పై పొట్టు తొలగించినప్పుడు, లోపలి ఉన్న విత్తనం చూస్తే అచ్చం బ్రెయిన్ ఆకారంను కలిగి ఉండటం చూస్తే, ఆశ్చర్యం కలగకమానదు. అనుకోకుండా ఇలా ఉండం చాలా ఆశ్చర్యం కలిగించడం మాత్రమే కాదు, బ్రెయిన్ ఆకారంలో ఉండే ఈ గింజలు, డ్రైఫ్రూట్స్ బ్రెయిన్ పవర్ ను పెంచుతాయి.

బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి. వాల్ నట్స్ ని తెలుగులో అక్రూట్ కాయ గింజలు అంటాము. మనకు వయసుతో పాటు కొన్నీ శారీరక రుగ్మతలు ఏర్పడి ఇబ్బంది పెడుతుంటాయి . వాటిని ముందుగానే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అదపులో ఉండి జీవితతం సాఫీగా సాగిపోతుంది. పౌష్టికాహారపదార్ధములలో వాల్ నట్స్ వలన ఎన్నో ప్రయోజనాలు కలవని నిర్ధారణ అయినది. ఆరోగ్యానికి మాత్రమే కాదు సౌందర్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మరి ఈ వాల్ నట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో.. మీ రెగ్యులర్ డైట్ లో వీటిని చేర్చుకోవడం వల్ల మీ బ్యూటీ మీద ఇవి ఏవిధంగా ప్రభావం చూపివస్తాయో ఇప్పుడు తెలుసుకోండి.

Advertisement

గుండెని సంరక్షిస్తాయి..

వాల్నట్స్ మన గుండెకి ఎంతో మేలు చేకూరుస్తాయి. గుండెల్లోని మంటను తగ్గించి రక్తనాళాల పనితీరును మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఇందులో ఉండే ఓమేగా-3కి సంబంధించి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ధమనుల ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది

Advertisement

వాల్ నట్స్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి, ఇదిచర్మం యొక్క పునరుత్పత్తిని, స్థితిస్తాపకతను ప్రోత్సహిస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్ ఫ్రూట్ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. సెల్ డ్యామేజ్ ను రిపేర్ చేస్తుంది, ఇంకా, స్కిన్ టోన్ మెరుగుపరచి, వృద్ధాప్య ఛాయలు కనబడనివ్వకుండా, చర్మం ప్రకాశంతంగా కనబడేలా చేస్తుంది. ముఖంలో చారలు, ముడుతలు లేదా స్పాట్స్ వంటి వాటిని నివారించుకోవడానికి వాల్ నట్స్ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని పొందండి.

స్వచ్చమైన ప్రకాశించే చర్మం

వాల్ నట్స్ లో కెమికల్ లక్షణాలున్నాయి, ఇవి శరీరంలో బ్లడ్ సర్కులేషన్ ను పెంచుతాయి, అందువల్ల శరీరంలో ప్రతి ఒక్క కణానికి, కణజాలనిక ఆక్సిజెన్, న్యూట్రీషియన్ ను సరఫరా చేస్తుంది. ఇది రక్తప్రసరణకు బాగా సహాయపడుతుంది . దాంతో చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మెరుస్తుండటానికి సహాయ పడుతుంది. ఒక రోజులో స్నాక్స్ సమయంలో 3,4 వాల్ నట్స్ తింటే, మీ చర్మం హెల్తీగా, కాంతివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది.

Advertisement

స్కిన్ ఇన్ఫెక్షన్ నివారించే వాల్ నట్ ఆయిల్

చర్మం అందంగా, ప్రకాశవంతంగా మార్చడంలో వాల్ నట్ డ్రై ఫ్రూట్ చాలా సహాయపడుతుంది. వాల్ నట్ లో ఉండే ఆయిల్ లక్షణాలు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తాయి. వాల్ నట్ ఆయిల్లో, యాంటీ ఫంగాల్ , యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అథ్లెటిస్ వారి పాదు, పోరియాసిస్, కాండిడ వంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను చాలా గ్రేట్ గా నివారిస్తాయి. వెల్లుల్లి వంటి యాంటీ ఫంగల్ పదార్థాలతో మిక్స్ చేసి, అప్లై చేయడం వల్ల గాయాలను త్వరగా నయం చేస్తాయి.

మంచి స్కిన్ స్ట్రక్చర్

Advertisement

వృద్ధాప్యంతో పోరాడటం మాత్రమే కాదు, మీ చర్మంను కాంతివంతగా మార్చడంలో వాల్ నట్స్ మొత్తం చర్మం ఆరోగ్యానికి చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే వీటిలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి, స్కిన్ డ్యామేజ్ ను ఎదుర్కొంటాయి. వీటితో పాటు, వాల్ నట్ లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ సెల్స్ ను బలోపేతం చేస్తాయి, చర్మానికి తగినంత తేమను అందిస్తాయి. మరియుచర్మంలోని మలినాలను తొలగిస్తాయి. ఈ నట్స్ లో ఉండే ప్రోటీనులు ఎముకలను బలోపేతం చేస్తాయి. కొలెజాన్ ఉత్పత్తికి సపోర్ట్ చేస్తాయి.

అందమైన, స్ట్రాంగ్ హెయిర్

వాల్ నట్ ఆయిల్ ను ఒక సుగంధ భరిత నూనెవలే అనేక హెయిర్ ప్రొడక్ట్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ డ్రై ఫ్రూట్ జుట్టును బ్లాక్ గా, ప్రకాశవంతంగా మార్చుతాయి. ఎందుకంటే వాల్ నట్ లో ఉండే బయోటిన్, న్యూట్రీషియన్స్ హెయిర్ ను స్ట్రాంగ్ గా, వాల్యూమినస్ గా చేస్తాయి . వాల్ నట్ లో ఇంకా ప్రోటీనులు హెయిర్ రూట్స్ ను బలోపేతం చేస్తాయి . వాల్ నట్ ఆయిల్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు స్ట్రాంగ్ గా, బ్యూటిఫుల్ గా మారుతాయి.

Advertisement

ప్రశాంతమైన నిద్ర పట్టేలా చేస్తాయి

అవును, వాల్ నట్ మూడ్ ను పెంచుతుంది. ఎందుకంటే, ఇందులో విటమిన్ బి, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి మూడ్ ను పెంచుతుంది. డిప్రెషన్ ను నివారిస్తుంది. అలసట, ఆందోళన మరయు నిద్రలేమి సమస్యలను కూడా నివారిస్తుంది. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో వాల్ నట్స్ ను చేర్చుకోవాలి, టెన్షన్ లేకుండా మంచి నిద్రను పొందవచ్చు. ఎందుకంటే నిద్రలేమి వల్ల కళ్ళక్రింది ఉబ్బు, ముడుతలు, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.

అజీర్తి సమస్య ఉండదు..

Advertisement

వాల్నట్స్ జీర్ణసంబంధిత సమస్యలకు బాగా పని చేస్తుంది. జీవక్రియ, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. వాల్నట్స్ పేగు సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది. అందుకు ఉపయోగకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను పెంచే ప్రీబయోటిక్ లక్షణాల మంచి ఎంపిక.

గర్భధారణ సమయంలో మంచిది

వాల్ నట్స్ లో విటమిన్ బి కాంప్లెక్స్ మూలాలు ఉండటం వల్ల ఇవి మన శరీరానికి అవసరం అయ్యే ఫొల్లెట్, రిబోఫ్లెవిన్, థయమిన్, ఇతర అంశాలను కూడా అందిస్తుంది. వాల్ నట్స్ లో మెగ్నీషియం, ప్రోటీనులు, హెల్తీ ఫైబర్, ఫ్యాటీ యాసిడ్స్ ను కలిగి ఉండటం వల్ల గర్భిణీ మహిళలకు చాలా మేలు చేస్తుంది. అలాగే కడుపులో బిడ్డకు కూడా మేలు చేస్తుంది . ఇంకా వాల్ నట్ ఆయిల్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల ఆరోగ్యానికి, అందానికి మంచిది.

Advertisement

బరువు తగ్గిస్తుంది

అన్ని రకాలుగాను ఉపయోగపడే వాల్ నట్, చర్మానికి ఒక రూపును, వ్యాధి నిరోధకశక్తిని పెంచడం మాత్రమేకాదు, ఇది బరువు తగ్గించుటలో కూడా గ్రేట్ గా సహాయ పడుతుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువ కంటెంట్ ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్స్ వల్ల ఇది బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఇది శరీరంలో కొవ్వు చేరకుండా నిరోధిస్తుంది. వాల్నట్స్ ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గే అవకాశముంది. ఇవి ఆకలిని తగ్గించేస్తాయి. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. వీటిని చిరు తిండిగా తీసుకుంటే ఇంకా మంచిది. సలాడ్లలో వీటిని తినవచ్చు. లేదా అరటి, మామిడి జ్యూస్ ల్లో పొడిగా వేసుకొని తీసుకోవచ్చు. అంతేకాకుండా పచ్చి వాల్నట్స్ ను కూడా తినవచ్చు. వీటి పోషకాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఆరోగ్యంగా ఉండేదుకు సాస్ ల్లోనూ వేసుకుని తినవచ్చు. ఈ విధంగా వాల్నట్స్ ను అధికంగా తీసుకుంటే శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా పైన చెప్పిన సమస్యల నుంచి ఉపశమనం పొందుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు వీటిని ఇస్తే ఎంతో మంచిది.

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి..

Advertisement

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాల్లో వాల్నట్స్ ముందు వరుసలో ఉంటాయి. విటమిన్-ఈ, ఎలాజిక్ యాసిడ్, మెలాటోనిన్, కెరోటినాయిడ్లలో లాంటి ఇతర గింజల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

బ్రెయిన్ హెల్త్

మెదడు సామర్థ్యాన్ని,జ్ఝాపక శక్తిని పెంచి మెదడు చురుకుగా పనిచేసేందుకు సహాయపడుతుంది . మతిమరపును నివారిస్తుంది. బ్రెయిన్ పవర్ పెంచుకోవాలంటే, ప్రతి రోజూ కొన్ని వాల్ నట్స్ ను తీసుకోవడం ఉత్తమం. వాల్ నట్స్ ఆక్సిజన్, న్యూట్రీషియన్స్ ను రక్తంకు సరఫరా చేయడంతో శరీరం అంతా ప్రసరణ జరుగుతుంది.

Advertisement

డిప్రెషన్ కు సరైన నివారణ..

ఓమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలను అత్యధికంగా అందించే వాటిలో నట్స్ లో వాల్నట్స్ ఒకటి. ఇవి మెదడు పనితీరును మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. అంతేకాకుండా నిరాశకు లోనుకావడం, కుంగిపోవడం లాంటి లక్షణాలను తగ్గించి మనసుకు ప్రశాంతతను చేకుస్తాయి.

వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది

Advertisement

వాల్ నట్స్ లో మంచి ఫ్యాట్, విటమిన్స్, ప్రోటీనులు, ఇతర న్యూట్రీషియన్స్ కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది . మీలో వ్యాధి నిరోధకశక్తిని పెంచడంలో, మొత్త శరీరం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. వాల్ నట్స్ హార్ట్ డిసీజ్, కొన్ని రకాల క్యాన్సర్లను ఎదుర్కొంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచి, జీవక్రియలు పనిచేసే సామర్థ్యాన్ని పెంచతుంది . వాల్ నట్ చర్మం క్లియర్ గా మార్చుతుంది. కంటిచూపును మెరుగు పరుస్తుంది

Advertisement
Continue Reading
Advertisement

Featured

Butter Milk Side Effects: ఆరోగ్యానికి మంచిదని మజ్జిగ ఎక్కువ తాగుతున్నారా… ప్రమాదంలో పడినట్లే?

Published

on

Butter Milk Side Effects: మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఎంతో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. ఇక మనం తీసుకునే ఆహార పదార్థాలలో తప్పనిసరిగా పెరుగు లేదా మజ్జిగ ఉండటం సర్వసాధారణం అయితే పెరుగుతో పోలిస్తే చాలామంది మజ్జిగ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మజ్జిగలో కూడా ఎన్నో పోషక విలువలు దాగి ఉండడంతో ప్రతిరోజు మజ్జిగ తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుందని భావిస్తూ ఉంటారు.

1

ఇలా మజ్జిగ తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరం కూడా హైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుందని భావిస్తూ చాలామంది మజ్జిగ తాగుతూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి మంచిది కాదని మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ప్రమాదంలో పడతామని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగను అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు మనల్ని వెంటాడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

పాలు పాల పదార్థాలలోనూ లాక్టోస్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది చాలామందిలో జీర్ణక్రియను పూర్తిగా మందగించేలా చేస్తుంది. ఎవరికైతే లాక్టోస్ ను జీర్ణం చేసే ఎంజైమ్‌ ఎక్కువగా ఉత్పత్తి కావు లాంటివారికి మజ్జిగ తాగటం వల్ల అవి జీర్ణం కాక వాంతులు అయ్యే పరిస్థితులు ఏర్పడుతుంటాయి అలాగే కడుపు నొప్పి రావడం కడుపు చాలా ఉబ్బర కావడం విరోచనాలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే ఇలాంటి వారు ఎక్కువగా మంచిగా తీసుకోకపోవడం ఎంతో మంచిది.

Advertisement

చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి…

ముఖ్యంగా ఈ సమస్య చిన్న పిల్లలలో అధికంగా కనబడుతూ ఉంటుంది. అలాంటివారు రోజుకు కేవలం ఒక గ్లాస్ మజ్జిగ తాగడం మంచిది ఇక చాలా మంది మజ్జిగలో ఉప్పు అధికంగా వేసుకొని తాగుతూ ఉంటారు ఇలా అధికంగా ఉప్పు వేసుకొని తాగడం వల్ల మన శరీరంలో ఉప్పు నిలువలు పెరిగిపోయి హై బీపీ రావడానికి కూడా కారణం అవుతుంది. ఇక మరికొందరికి చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక రోజు ఒక గ్లాస్ కి మించి మజ్జిగ తాగకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Pregnant After 40 Years: మహిళలు 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం మంచిదేనా… నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Published

on

Pregnant After 40 Years: ప్రస్తుత కాలంలో మహిళలు కూడా విద్యా ఉద్యోగం అంటూ పెళ్లిళ్లు చేసుకోవడం కూడా చాలా ఆలస్యంగా చేసుకుంటున్నారు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వెంటనే పిల్లలని ప్లాన్ చేయడం లేదు అందుకే ప్రస్తుత కాలంలో మహిళలందరూ కూడా 30 తర్వాత దాదాపు 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పిల్లలను కనడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలా మహిళలు 40 కి దగ్గర పడుతున్న సమయంలో పిల్లలను కనడం వారి ఆరోగ్యానికి మంచిదేనా పిల్లల ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందా అనే విషయానికి వస్తే…

40 సంవత్సరాల వయసు దగ్గర పడుతున్న సమయంలో పిల్లల్ని కనడం పెద్ద తప్పు అని నిపుణులు చెబుతున్నారు. పిల్లలను కనడానికి 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఎంతో మంచిదని ఈ సమయంలో పిల్లలను కనడం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా జన్మిస్తారు. 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి మహిళలలో విడుదల అయ్యే అండాల నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంది తద్వారా పిల్లలు పుట్టడం కూడా చాలా అరుదు ఒకవేళ పుట్టిన ఎన్నో రకాల సమస్యలతో జన్మిస్తూ ఉంటారు.

40 సంవత్సరాల వయసు దగ్గరకు పడే మహిళలలో రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడే వారు పిల్లల్ని కనుక కణాలని భావిస్తే వారి జీవితాన్ని కూడా ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. 30 సంవత్సరాల లోపు మొదటి బిడ్డకు జన్మనివ్వడం ఎంతో మంచిది అయితే మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి ఆరు ఏడు నెలల వ్యవధిలోని మరొకసారి గర్భం దాల్చడం చాలా ప్రమాదకరం.

Advertisement

18 నెలల గ్యాప్ అవసరం…


మొదటి బిడ్డకు రెండవ బిడ్డకు 18 నుంచి 23 నెలల గ్యాప్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఇలా ఉంటేనే రెండో బిడ్డకు ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదు. అలా కాకుండా ఐదు నెలల గ్యాప్ లోనే మరోసారి గర్భం దాల్చితే అది తల్లి బిడ్డల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఇలా గర్భం దాల్చడం వల్ల రక్తస్రావం జరగడం, తల్లి ఆరోగ్యం పై అధిక ప్రభావం చూపడం వంటివి జరుగుతుంటాయి.అందుకే పిల్లల విషయంలో సరైన ప్లానింగ్ ఎంతో అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Doctor Kiran : ఫోన్ వల్లే గుండె పోటు… వాక్సిన్ వల్ల జరుగుతోంది…: డాక్టర్ కిరణ్

Published

on

Doctor Kiran : కరోనా నీలి నీడలు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నలభై ఏళ్ల లోపు వాళ్ళు గుండె పోటుతో చాలా మంది మరణించడం కలవరపెడుతోంది. ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చి మరణిస్తుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక్క రోజులోనే తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది మంది యుక్త వయసు వాళ్ళు గుండెపోటుతో అక్కడికక్కడే మరణించడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక అసలు యుక్త వయసు వారికి గుండెపోటు రావడం వంటివి ఎందుకు సంభవిస్తున్నాయి, దీనికి గల కారణాలు వంటి విషయాలను డాక్టర్ కిరణ్ వివరించారు.

వాక్సిన్ కాదు స్మార్ట్ ఫోన్ వల్లే గుండె పోటు…

మారుతున్న జీవన సరళి వల్ల ఆహారపు అలవాట్లు, పని అన్నీ మారిపోయి మనం ఊబకాయం, షుగర్ వంటి వ్యాధుల భారిన పడటం వలన ఇన్ని రోజులు గుండెపోటు మరణాలు సంభవించేవి. అయితే ఇప్పుడు యుక్త వయసులో ఉన్నవారికే ఎక్కువగా గుండెపోటు సంభవించడానికి గల కారణాలను డాక్టర్ కిరణ్ వివరించారు. యువతలో అనారోగ్యాలకు గుండె ఆరోగ్యం మీద చూపే ప్రభావాలలో మొదటిది ఫోన్ వాడకం.

Advertisement

గంటలు గంటలు ఫోన్లను చూస్తూ చేతులు కాళ్ళు కదల్చకుండా ఉంచడం వల్ల చాలా శరీర భాగలకు రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతాయి. అపుడు రక్తం సరఫరా చేయడానికి గుండె మరింత బలంగా కొట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందువల్ల గుండె మీద భారం అధికమై చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఇక బరువు ఉన్నట్టుండి తగ్గడం లేదా పెరగడం వల్ల కూడా ప్రమాదాలు ఎదురావుతున్నాయని తెలిపారు. ఇక కరోనా వాక్సిన్ వల్ల గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి అనేది అపోహ మాత్రమే, ఆ వాక్సిన్లు వేయించుకున్నందుకే మనం బ్రతికి ఉన్నాం అంటూ తెలిపారు.

Continue Reading
Advertisement

Trending

Don`t copy text!