లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన హీరోయిన్ నయనతార పుట్టిన రోజు నేడు. స్టార్ హీరోయిన్ గా సౌత్ ని ఏలుతున్న నయనతార నేడు 37వ ఏట అడుగిడనున్నారు. దీంతో నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దాదాపు ఆరేళ్లుగా నయనతార-విగ్నేష్ ప్రేమించుకుంటున్నారు. నానుమ్ రౌడీ దాన్ షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడడం జరిగింది.

కెరీర్ బిగినింగ్ లో శింబుతో రిలేషన్ నడిపిన నయనతార, ఆ తరువాత ప్రభుదేవాను ప్రేమించడం జరిగింది. వాళ్ళిద్దరితో బ్రేకప్ తరువాత నయనతార విగ్నేష్ శివన్ తో డేటింగ్ చేస్తున్నారు. ఇటీవల విగ్నేష్ శివన్ నిర్మాణంలో దర్శకుడు మిలింద్ రాజ్ తెరకెక్కిన చిత్రం నేత్రికన్ మూవీలో నయనతార నటించిన విషయం తెలిసిందే. తర్వాత విఘ్నేష్ దర్శకత్వంలోనే నయనతార, సమంత, విజయ్‌సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’.
దీంతో ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె పోషించిన కణ్మణి పాత్రకు సంబంధించి పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర బృందం సభ్యులు. కాగా నవంబర్ 17న అర్థరాత్రి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు విగ్నేష్. ఈ వేడకుకు హీరోయిన్ సమంత కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Pure love ????stay blessed Thalaivi#HBDLadySuperStarNayanthara #Nayanthara ❤️
— Nayanthara Trends (@TrendNayanthara) November 18, 2021
Birthday Bash pic.twitter.com/vqqqOGojgs
ఆమెకు ఎంతో అందంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు విగ్నేష్ శివన్. నెటిజన్లు కూడా నయనతారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే.. వీళ్లిద్దరు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నా పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. డేటింగ్ బోర్ కొడితే తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తామని ఇటీవల విగ్నేష్ చెప్పుకొచ్చాడు.

































