సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఎంతో మంది రోగులు ఉంటారు. రైల్వే స్టేషన్ కు దగ్గరగా ఉండటంతో అక్కడికి ఎంతో మంది పేదలు వారి వైద్యానికి సంబంధించి ట్రీట్ మెంట్ కోసం వస్తుంటారు. ఈ రోజు ఉదయం అక్కడ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడ లేబర్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

వెంటనే అక్కడి ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో భారీ ప్రమాదం తప్పింది. భయంతో అక్కడి రోగులు బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. గాంధీ ఆసుపత్రిలో ఎప్పటిలాగే ఉద్యోగులు తమ విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ రోజు ఉదయం అక్కడే ఉన్న లేబర్ రూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా దవాఖాన నాలుగో అంతస్తులోని విద్యుత్ ప్యానెల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.
ఆ మంటలను అక్కడే ఉన్న ఆసుపత్రి సిబ్బంది గమనించి.. వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే వాళ్లు వచ్చే లోపే కొంతమంది రోగులు మంటల్లో చిక్కుకున్నారు. ఇలా అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన రోగులు భయంతో బయటకు పరుగులు తీశారు.
మొదట మంటలు వస్తున్న క్రమంలో అగ్నిమాపక సిబ్బంది రావడం ఆలస్యం కావడంతో.. ఆసుపత్రి సిబ్బందే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వాళ్లే అక్కడ ఉన్న చాలామంది రోగులను కాపాడారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.





























