సోషల్ మీడియా సంస్థ అయిన ట్విట్టర్ కు భారీ దెబ్బ పడిందని చెప్పవచ్చు.గతంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త నియమాలను పాటించాలని వివిధ సోషల్ మీడియా సంస్థలకు తెలిపిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆ సంస్థలకు సంబంధించిన అధికారుల వివరాలను వెల్లడించాలని కేంద్రం తెలుపగా అన్ని సంస్థలు అధికారుల వివరాలను వెల్లడించినప్పటికీ ట్విట్టర్ మాత్రం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను పాటించలేదు.

మన దేశంలో కొత్త ఐటీ చట్టాల ప్రకారం స్టాట్యుటరీ ఆఫీసర్లను నియమించడంలో విఫలమైన ట్విట్టర్‌కు పెద్ద షాక్ తగిలింది. దీంతో మధ్యవర్తి హోదాను కోల్పోయింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ పై ఎలాంటి అవకతవకలు జరిగిన ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర్నుంచి టాప్ ఎగ్జిక్యూటీవ్స్ వరకు పోలీసులు విచారణ జరిగే అవకాశాలు ఉంటాయి.
ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సప్ లాంటివాటికి ఈ రక్షణ కవచం ఉంది. కానీ ట్విట్టర్ కి ఈ రక్షణ కవచం లేదనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ట్విట్టర్ భారత దేశంలో మధ్యంతర చీఫ్ కాంప్లయెన్స్ నియమించామని వారి వివరాలను మంగళవారం ఐటి శాఖకు వివరిస్తామని తెలిపిన ట్విట్టర్ ఆ రూల్స్ ని అమలు చేయకపోవడంతో మధ్యవర్తి హోదాను కోల్పోయింది.
ఇదివరకే కేంద్రప్రభుత్వం కొత్త ఐటీ రూల్స్ కి అనుగుణంగా చర్యలు తీసుకోకపోతే చట్టపరమైన రక్షణ ను కోల్పోతారని తెలుపుతూ జూన్ 5వ తేదీన కేంద్రం ట్విట్టర్ కి ఆదేశాలు జారీచేసింది. ఈ విధంగా ట్విట్టర్ సంస్థకు పదే పదే గుర్తు చేసినప్పటికీ ట్విట్టర్ నుంచి సానుకూల ప్రభావం రాకపోవడంతోనే ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది.ఈ విధంగా ట్విట్టర్ రక్షణ కవచం కోల్పోవడంతో ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి మొట్టమొదటిసారిగా ట్విట్టర్ పై కేసు నమోదు చేశారు.



























