కామంతో కళ్లు మూసుకుపోయిన వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఓ మహిళ స్నానం చేస్తుండగా సీక్రెట్ గా కెమెరా అమర్చి వీడియో రికార్డు చేశాడు. దానిని తీసుకొని అందులో స్నానం చేస్తున్న వీడియో చూసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడో ఓ ప్రబుద్దుడు. ఇలానే మరో రోజు రికార్డు చేస్తున్న క్రమంలో లేసర్ లైట్ వెలుగుతుండగా గమనించిన సదరు మహిళ భర్తకు చెప్పింది.

దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తంజావూరుకు చెందిన మాజీ డిప్యూటీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కు 35 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతడి పేరు నసీర్ అహ్మద్. అతడికి వివాహం అయి ఆరు సంవత్సరాల పాప కూడా ఉంది. అతడు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే ఓ వ్యక్తి కిరాయికి ఉంటున్నాడు.
అతడికి భార్య, కూతురు ఉన్నారు. అతడు అక్కడే ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నాడు. వీళ్ల బాత్రూం నసీర్ నివాసం ఉండే ఇంటికి సమీపంలో ఉండేది. అయితే పక్కనే ఉన్న ఇంటి మేడపైకి ఎక్కి అక్కడ బాత్రూంలో రహస్య కెమెరా అమర్చాడు. ఇలా వాళ్లు స్నానం చేస్తుండగా వీడియోలు రికార్డు చేసి.. వాటిని అతడే చూసి పైశాచిక ఆనందాన్ని పొందేవాడు. ఇలా ఓ రోజు ఆమె రహస్య కెమెరాను గుర్తించి భర్తకు చెప్పింది. వారిద్దరు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతడు మాజీ డిప్యూటీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కుమారుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అతడితో కొన్ని రోజుల క్రితమే సదరు మహిళ భర్తకు గొడవ అయింది. ఓ రోజు అతడి కూతురు స్నానం చేస్తుండగా మేడ పైకి వెళ్లి చూస్తున్న క్రమంలో అతనితో గొడవ పెట్టుకున్నాడు. అప్పటి నుంచి కోపం పెంచుకున్న నసీర్ మరింతగా రెచ్చిపోయి ఇలా చేశాడని పోలీసులు వెల్లడించారు.































