మారుతున్న కాలంతో పాటే పిల్లలకు చదువు చెప్పించాలంటే ఖర్చు రోజురోజుకు పెరుగుతోంది. స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలే అయినా పేద కుటుంబాల పిల్లలు వేర్వేరు కారణాల వల్ల చదువుకు దూరమవుతున్నారు. చిన్న వయస్సులోనే కూలి పనులు చేస్తూ విద్యకు దూరమవుతున్నారు. అలాంటి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వారికి ప్రయోజనం చేకూర్చడానికి నెక్ట్స్‌వేవ్ అనే సంస్థ ముందుకొచ్చింది.

ఈ సంస్థ పేదరికం వల్ల చదువుకు దూరమైన పిల్లలకు చదువుతో పాటు నైపుణ్యాలను నేర్పిస్తోంది. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు నెక్స్ట్ వేవ్ ఆన్ లైన్ ద్వారా క్లాసులను నిర్వహిస్తోంది. ఆన్ లైన్ లో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని నెక్స్ట్ వేవ్ సహాయంతో ఈ కార్యక్రమంలో చేరవచ్చు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో చేరిన రోజు నుంచి 21 సంవత్సరాల వరకు ఈ సంస్థ అండగా ఉంటుంది.

నెక్స్ట్ వేవ్ పేద పిల్లలకు చదువు నేర్పించడంతో వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన లక్షాలాది మంది విద్యార్థులకు చేయూత అందించాలని నెక్స్ట్ వేవ్ సంస్థ భావిస్తోంది. నెక్ట్స్‌వేవ్ ప్రతినిధులు ఈ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులు ఉద్యోగం సంపాదించడానికి, సరికొత్త ఆవిష్కరణలను రూపొందించడానికి కావాల్సిన నైపుణ్యాలను పెంపొందిస్తామని తెలుపుతున్నారు.

ఐబీ హబ్స్ సీఈవో దొమ్మేటి కావ్య ప్రతి చిన్నారికి సమానమైన అవకాశాలు కల్పించేలా చేస్తున్నామని చెబుతున్నారు. ఈ కోర్సు పూర్తిగా ఉచితం. https://www.onthegomodel.com/free-education-for-children వెబ్ సైట్ ద్వారా ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here