మన శరీరంలో ఉండే వివిధ అవయవాలు వివిధ పనులను నిర్వహిస్తుంటాయి. ఈ క్రమంలోనే మూత్రపిండాలు నిరంతరం రక్తాన్ని శుద్ధి చేస్తూ వడపోస్తుంటాయి. ఈవిధంగా వడపోత కార్యక్రమంలో విడుదలయ్యే వ్యర్థ పదార్థాలను మూత్రాశయం నిల్వ ఉంచుకుని ఉంటుంది. సాధారణంగా మన మూత్రశయం 300 నుంచి 600 మిల్లీలీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా మూత్రాశయం నిండిన తరువాత నాడుల ద్వారా ఈ సమాచారం మన మెదడుకు చేరవేసి మనకు టాయిలెట్ వెళ్లాలనే సమాచారాన్ని పంపిస్తుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ.

ఈ విధంగా ప్రతి రోజు సుమారుగా ఎనిమిది సార్లు మనం మూత్రాశయానికి వెళితే మనలో ఎటువంటి సమస్య లేదని అర్థం. కానీ కొందరు తరచూ మూత్రాశయానికి వెళుతూ ఉంటారు. ఈ విధంగా మూత్రాశయాన్నికి తరచూ వెళ్లడం వల్ల వారిలో పలు సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పవచ్చు. ఈ విధంగా తరచు మూత్రాశయం రావడానికి గల కారణం మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ కావడం, అధిక శరీర బరువు పెరగడం, అదే విధంగా ఎక్కువ సంతానం కలిగినవారిలో మూత్రాశయ కండరాలు బలహీనపడటం వల్ల తరచూ మూత్రానికి వెళుతూ ఉంటారు.

ఈ విధంగా అతిమూత్ర సమస్య ఉన్నవారు తరచూ టాయిలెట్ కి వెళ్లడం, కొందరిలో మూత్రాశయం లీక్ అవ్వడం, అలాగే కొందరు దగ్గినా,తుమ్మినా, అతిగా నవ్విన వారిలో మూత్రాశయం లీక్ అవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ విధమైన సమస్యలు కలిగి ఉన్నవారికి సర్జరీ చేయడం ద్వారా ఈ సమస్య నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు. అదే విధంగా ఈ సమస్య నుంచి కొంతవరకు ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యనుంచి ఉపశమనం పొందవచ్చు.

ఎక్కువ మూత్రాశయం వెళ్లేవారు రాత్రి సమయంలో వీలైనంత వరకు ద్రవ పదార్థాలను దూరంగా పెట్టడం ఎంతో ఉత్తమం.ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు రాత్రిపూట పాలు మజ్జిగ లేదా ఏవైనా పండ్లు రసాలను తీసుకోకపోవటం వల్ల కొంతవరకు ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా మన శరీర బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అధిక శరీర బరువు కారణంగా మూత్రాశయం పై అధిక ఒత్తిడి పడటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ధూమపానం మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది.అదే విధంగా అధిక ఫైబర్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ మూత్రాశయ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here