చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తరువాత వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. అదే విధంగా ఈ సినిమా తరువాత చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ చిత్రమైన లూసిఫర్ రీమేక్ చిత్రాన్ని నటిస్తున్నారు. ఈ చిత్రానికిగాను మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఈ ప్రజాయుద్ధ నౌక, ప్రజానాట్యమండలి కళాకారుడు గద్దర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. గద్దర్ ఈ సినిమాలు ఓ కీలక పాత్రలో నటించబోతున్నారనే సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మోహన్ రాజా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాగా ఫేమస్ అయిన నటీనటులను ఈ సినిమాలో తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడం కోసం చిత్రబృందం గద్దర్ ను సంప్రదించగా అతను ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని , వచ్చే షెడ్యుల్ లో భాగంగా గద్దర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. గద్దర్ తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి స్టార్ సెలబ్రిటీలను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్,లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.


































