Game Changer: పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా షూటింగ్ పనులలో రామ్ చరణ్ ఎంతో బిజీ అయ్యారు.

ఈ సినిమా షూటింగ్స్ శర వేగంగా జరుగుతున్న నేపథ్యంలో భారతీయుడు 2 సినిమా షూటింగుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో తప్పనిసరి పరిస్థితులలో శంకర్ ఈ సినిమా షూటింగ్ పనుల నిమిత్తం వెళ్లాల్సి వచ్చింది. దీంతో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇక రాంచరణ్ వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు ఈ సినిమా షూటింగ్ కి దూరంగా ఉన్నారు.
రామ్ చరణ్ సతీమణి ఉపాసన డెలివరీకి సమయం దగ్గర పడినప్పటి నుంచి రాంచరణ్ ఈ సినిమా షూటింగ్ కు దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో జాయిన్ అయ్యారు. ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండగా డైరెక్టర్ శైలేష్ కొలను గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ చేయబోతున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది. దీంతో మెగా అభిమానులు అసహసనం వ్యక్తం చేశారు.

Game Changer: గేమ్ ఛేంజర్ డైరెక్టర్ గా శంకర్..
ఈ విధంగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వార్తలకు శంకర్ చెక్ పెట్టారు. ప్రస్తుతం ఈయన డైరెక్షన్ చేస్తున్నటువంటి ఓ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ గేమ్ ఛేంజర్ సినిమా గురించి వస్తున్నటువంటి ఈవార్తలలో ఏమాత్రం నిజం లేదని ఈ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తున్నాను అని అర్థం వచ్చేలా ఈ పోస్ట్ చేశారు. ప్రస్తుతం శంకర్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Jumping right into a riveting fight sequence. Back in action, truly! #Gamechanger pic.twitter.com/HKpjXeNfbH
— Shankar Shanmugham (@shankarshanmugh) July 11, 2023