Garikapati: తెలుగు నాట తన ప్రవచనాలు, చలోక్తులతో అద్భుతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్న గరికపాటి చుట్టూ ఈ మధ్యన వివాదం సాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన గరికపాటి.. అదే కార్యక్రమానికి వచ్చిన చిరంజీవిని ఉద్దేశించి చేసిన కామెంట్లు వివాదానికి తెర తీశాయి.

అలయ్ బయట్ కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి.. అక్కడున్న వారితో ఫోటోలు దిగుతుండగా.. చిరంజీవి ఫోటోలు దిగడం ఆపాలని, అప్పుడే తాను ప్రసంగం మొదలుపెడతానని గరికపాటి చెప్పారు. దీంతో మెగా ఫ్యాన్స్ గరికపాటి మీద సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. గరికపాటి పాత వీడియోలను పోస్ట్ చేస్తూ రకరకాలుగా కామెంట్లు పెట్టారు.
తాజాగా ఈ వివాదం మీద స్పందించిన చిరంజీవి.. వివాదానికి ముగింపు పలికారు. గరికపాటి పెద్ద వారని, వారి గురించి వివాదాస్పద చర్చ పెట్టడం సరికాదని చిరంజీవి వ్యాఖ్యానించడంతో ఇది సమసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఈ వివాదాన్ని మళ్లీ రాజేస్తూ బాబుగోగినేని ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది.

Garikapati
గతంలో గరికపాటి మహిళల గురించి, అత్యాచారాల గురించి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన గోగినేని.. గరికపాటి తనకు తెలుగు తాలిబన్ లాగా కనిపిస్తున్నాడంటూ సంచలన కామెంట్ చేశాడు. మహిళలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసినందుకు గరికపాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు గోగినేని వెల్లడించాడు. ఆల్బర్ట్ ఐన్ స్టీన్ పేరును కూడా సరిగ్గా పలకలేని గరికపాటి.. శాస్త్రీయ సిద్ధాంతాల గురించి లెక్చర్లు బాగానే ఇస్తుంటాడంటూ గోగినేని గట్టిగానే కామెంట్ చేశాడు.
































