Geetha Madhuri:టాలీవుడ్ ప్లే బాక్స్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ గీత మాధురి గురించి పరిచయం అవసరం లేదు. ఈమె పాటలకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇకపోతే గీతామాధురి నటుడు నందును ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ దంపతులకు 2019 ఆగస్టు నెలలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

గీతా మాధురి తన కూతురికి దాక్షాయిని అని నామకరణం చేశారు. ఇకపోతే ఆగస్టు 9వ తేదీ తన కూతురు మూడవ ఏట అడుగు పెట్టింది. ఇక తన కూతురి మొదటి రెండు బర్తడేలు కరోనా కారణం వల్ల పెద్దగా సెలబ్రేట్ చేయలేకపోయారు. ఈ క్రమంలోనే గీతామాధురి తన కూతురు మూడవ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ పుట్టినరోజు వేడుకలకు అత్యంత సన్నిహితులు బంధుమిత్రులు హాజరయ్యారు.ఈ క్రమంలోనే దాక్షాయిని మూడవ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను గీతామాధురి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఎంతోమంది ఈమె అభిమానులు తన కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Geetha Madhuri: బిగ్ బాస్ రన్నర్ గా గీత మాధురి..
ఇకపోతే గీతామాధురి సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం ఈమె బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గీతా మాధురి రన్నర్ గా నిలిచారు.ఇక ఈమె భర్త నందు సైతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే గీతామాధురి తాజాగా తన కూతురి బర్త్డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో ఒకసారిగా వైరల్ అయ్యాయి.































