జియో సంచలన నిర్ణయం.. 2,500 రూపాయలకే స్మార్ట్ ఫోన్..?

0
369

దేశీయ టెలీకాం రంగంలో జియో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. జియో రాకతో దేశంలోని ప్రజలకు అనేక ప్రయోజనాలు కలిగాయి. ఒకప్పుడు 1 జీబీ డేటా కోసం 100 రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉండగా జియో తక్కువ ధరకే ఉచిత కాల్స్, డేటాకు ఛార్జీలను వసూలు చేస్తూ టెలీకం రంగంలో అంతకంతకూ ఎదుగుతోంది. అనంతరం జియో ఫోన్ల ద్వారా టెలీకాం రంగంలో జియో మరో సంచలనం సృష్టించింది.

ఫీచర్ ఫోన్లు అయిన జియో ఫోన్లలో కూడా వాట్సాప్, యూట్యూబ్ లను అందుబాటులోకి తెచ్చి జియో ఫీచర్ ఫోన్ల విక్రయాల్లో ఇతర కంపెనీలతో పోలిస్తే ఎక్కువ మార్కెట్ ను సొంతం చేసుకుంది. రోజురోజుకు ప్రజల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో జియో మరో సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గతంలోనే జియో స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెస్తామని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఆ స్మార్ట్ ఫోన్ ధర అందరూ 4,000 రూపాయలకు అటూఇటుగా ఉంటుందని భావించారు. అయితే జియో మాత్రం అంతకంటే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొస్తూ ఉండటం గమనార్హం. జియో కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ జియో సంస్థ 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయల లోపు ధరకే స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు.
అయితే అధికారికంగా ఈ మేరకు ప్రకటన వెలువడాల్సి ఉంది.

2,500 నుంచి 3,000 రూపాయల లోపు స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వస్తే ఇతర స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై జియో స్మార్ట్ ఫోన్ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది. అతి త్వరలో జియో స్మార్ట్ ఫోన్ ప్రజలకు అందుబాటులోకి రానుందని సమాచారం.