బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోతో పరిచయమైన సుడిగాలి సుధీర్ గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో కామెడీ స్కిట్ లు చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించగా అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఈయనకు స్టార్ హీరోకి ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే మరోసారి సుధీర్ పెళ్లి గురించి వేదిక పై చర్చ జరిగింది.

జబర్దస్త్ లోనే కాకుండా పలు షోలలో కూడా బాగా బిజీగా ఉన్నాడు సుధీర్. పోవే పోరా అనే ఎంటర్టైన్మెంట్ షోలో యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో కూడా టీం లీడర్ గా చేస్తున్నాడు. మరో ఎంటర్టైన్మెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీ లో యాంకరింగ్ తో బాగా బిజీగా ఉన్నాడు సుధీర్. ఇక మరో బుల్లితెర యాంకర్ రష్మీ తో చేసే రచ్చ అంతా ఇంతా కాదని అందరికీ తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో రాఖీ పండుగ సందర్భంగా కమెడియన్స్ మొత్తం తమ అక్కా చెల్లెళ్లతో బాగా సందడి చేశారు. అంతేకాకుండా తమ అన్నలకు రాఖీలు కట్టి బాగా ఆకట్టుకున్నారు. ఇక యాంకరింగ్ చేస్తున్న సుడిగాలి సుధీర్ అక్క కూడా ఈ షోలో పాల్గొని సుధీర్ గురించి కొన్ని విషయాలు పంచుకుంది.
వాళ్ళిద్దరికీ తమ వయసులో ఒకటే ఏడాది గ్యాప్ ఉందని.. అక్కాతమ్ముళ్ల కంటే స్నేహితులుగా ఉంటామని.. అన్ని విషయాలు షేర్ చేసుకుంటామని తెలిపింది. గెటప్ శ్రీను వెంటనే.. అన్ని చేసుకోలేదు.. ఇంకా ఉన్నాయి.. నాకు తెలుసు.. నీకు చెబుతా అనేసరికి అక్కడున్న వాళ్ళందరూ తెగ నవ్వుకున్నారు. ఇక రాంప్రసాద్ మాట్లాడుతూ.. అక్క వీడి పెళ్లి కోసం ఇప్పటికి మూడు సార్లు కెనడా నుంచి వచ్చింది. పాపం ఫ్లైట్ చార్జీలు కన్నం. ఆ డబ్బులతో వీటికి మూడు పెళ్లిళ్లు అయ్యేవి అంటూ పంచు వేయగా అక్కడున్న వాళ్ళందరూ తెగ నవ్వుకున్నారు.
































