మరికొన్ని రోజుల్లో దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి. పండుగల సమయంలో చాలామంది మహిళలు బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే పసిడి రేటు ఆకాశాన్ని అంటుతోంది. తులం బంగారం 50,000 రూపాయల కంటే ఎక్కువ ధర పలుకుతుండటంతో సామాన్యులకు బంగారం అందని ద్రాక్షలా మారింది. అయితే కేంద్రం ఇదే సమయంలో మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.

మార్కెట్ ధర కన్నా 3000 రూపాయల కంటే తక్కువ చెల్లించి బంగారం కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. గోల్డ్ బాండ్ స్కీమ్ ద్వారా మహిళలు బంగారం కొనుగోలు చేయవచ్చు. మోదీ సర్కార్ సోమవారం రోజు నుంచి ఈ సరికొత్త ఆఫర్ ను మహిళలకు అందుబాటులోకి తెస్తోంది. ఆర్బీఐ కేంద్రం తరపున విక్రయించే ఈ గోల్డ్ బాండ్లను ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. సోమవారం నుంచి అక్టోబర్ 16 వరకు గ్రాముకు 5,051 రూపాయలు చెల్లించి గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.
10 గ్రాముల బంగారం కొనుగోలు చేయాలంటే 50,510 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తే మాత్రం గ్రాముకు 50 రూపాయల చొప్పున 10 గ్రాములకు 500 రూపాయల డిస్కాంట్ లభిస్తుంది. ప్రస్తుతం బంగారం మార్కెట్ ధర 53,000 రూపాయలు ఉండగా గోల్డ్ బాండ్లను ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తే 50,010 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది.
బ్యాంకులు, స్టాక్ ఎక్స్చేంజీలు, పరిమిత సంఖ్యలో పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఏడాదికి 2.5 శాతం చొప్పున గోల్డ్ బాండ్లపై వడ్డీ లభిస్తుంది. ఈ గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ కాలం 8 సంవత్సరాలు. ఎవరైనా అవసరం అనుకుంటే ఐదు సంవత్సరాల తర్వాత బాండ్లను విక్రయించి డబ్బు పొందవచ్చు. ఇంట్లో బంగారంపై ఎలాంటి వడ్డీ రాకపోయుఇనా గోల్డ్ బాండ్లలోని బంగారం ద్వారా వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.






























