ఆ గుడిలో భక్తులకు బంగారం ప్రసాదంగా ఇస్తారట..!

0
210

బంగారం ధర రోజురోజుకు పెరిగిపోతుంది. 10 గ్రాముల బంగారం 50,000 రూపాయల ఖరీదు చేస్తోంది. సామాన్య, మధ్య తరగతి వర్గాలు ఇప్పట్లో బంగారం కొనే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఆ గుడిలో మాత్రం భక్తులకు బంగారం ప్రసాదంగా ఇస్తారు. అలా భక్తులకు బంగారం ప్రసాదంగా ఇచ్చే గుడి మధ్యప్రదేశ్‌లోని రాత్లాం నగరంలో ఉంది. ఇక్కడి మహాలక్ష్మీ ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తులకు బంగారం, వెండి నాణేలను ఇస్తారు.

సాధారణంగా ఏ ఆలయంలోనైనా భక్తులను తీర్థప్రసాదాలు ఇస్తారు. కొన్ని దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ సాంప్రదాయం నేటికీ కొనసాగుతుంది. బంగారం, వెండి నాణేలను భక్తులకు ఇవ్వడం చాలా ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ ఆలయ నిర్వాహకులు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అయితే బంగారం, వెండి నాణేలను ప్రసాదంగా ప్రతిరోజూ ఇవ్వరు. దీపావళి పండుగకు ముందు ఐదు రోజులు మాత్రమే భక్తులకు నాణేలను ప్రసాదంగా ఇస్తారు.

దీంతో పండగకు కొన్ని రోజుల ముందు నుంచే గుడి వేల సంఖ్యలో భక్తులతో కిక్కిరిసిపోతుంది. దీపావళి పండుగ రోజున గుడికి దర్శనానికి వచ్చిన భక్తులందరూ దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆలయ నిర్వాహకులు 24 గంటలు గుడిని తెరిచే ఉంచుతారు. దీపావళి పండుగకు ముందు ఐదు రోజులు ఈ గుడిలో ధన త్రయోదశి ఉత్సవాలు జరుగుతాయి. ప్రసాదంగా ఇచ్చిన నాణేలను భక్తులు అమ్మడం, తాకట్టు పెట్టడం చేయరు.

నాణేలను భక్తులు పూజగదిలో ఉంచడం లేదా బ్యాంక్ లాకర్ లో పెట్టడం చేస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించి నాణేలను భద్రపరచుకున్న వారి ఇంట్లో మహాలక్ష్మి కొలువు తీరుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయానికి భక్తుల నుంచి సంవత్సరానికి 100 కోట్ల రూపాయల వరకు ఆదాయం చేకూరుతుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here