Poornima:తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొల్లపూడి మారుతి రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎన్నో అద్భుతమైన సినిమాలలో విలక్షణ నటుడిగా తండ్రిగా ఎంతో అద్భుతంగా నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు గొల్లపూడి మారుతి రావు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న మారుతి రావు 2019 డిసెంబర్లో కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి నటి పూర్ణిమ హాజరయ్యారు. ఈ క్రమంలోని ఈమె తన కెరీర్లో జరిగిన కొన్ని సంఘటనలు గురించి గుర్తు చేసుకున్నారు. జంధ్యాల దర్శకత్వంలో శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు తమిళ కన్నడ భాషలలో సుమారు 100 చిత్రాలకు పైగా నటించిన ఈమె వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇదిలా ఉండగా తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనకు ముందుగా సప్తపది అనే సినిమాలో అవకాశం వచ్చిందని అయితే అప్పటికి డాన్స్ రాకపోవడం చేత తనని రిజెక్ట్ చేశారని తెలియజేశారు. ఇక నాగేశ్వరరావు గారు తన సినిమాలలో నటించమని తనని ఎప్పుడు అడిగే వారని ఈ సందర్భంగా పూర్ణిమ వెల్లడించారు.
నాకు కూతుర్లు లేరు…
తన కెరీర్లో తనకు ఎంతో ఇష్టమైన సినిమా శ్రీవారికి ప్రేమలేఖ సినిమా అంటే ఎంతో ఇష్టమని వెల్లడించిన ఈమె ‘మనిషికి ఒక చరిత్ర’ అనే సినిమా షూటింగ్ సమయంలో గొల్లపూడి మారుతి రావు తన పట్ల వ్యవహరించిన తీరును కూడా గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో గొల్లపూడి మారుతి రావు తనపై నిజంగానే చేయి చేసుకున్నారని, ఆ సమయంలో మా నాన్న అక్కడే ఉన్నారు. మా అమ్మాయిని ఎందుకు కొట్టారని తనని ప్రశ్నించగా ‘నాకు కూతురు లేదు’ అని సమాధానం చెప్పారని పూర్ణిమ ఈ కార్యక్రమంలో తెలియజేశారు.































