Gone Prakash Rao : గత కొన్ని రోజులుగా బాగా వైరల్ అవుతున్న వార్త ఏదైనా ఉంది అంటే అది మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి పెళ్లి. వీళ్లిద్దరు రెండో పెళ్లి చేసుకోబుతున్నారానగానే అసలు వీరికి ఎలా పరిచయం అనే ఆరాలు మొదలయ్యాయి. మనోజ్ స్నేహితుడు రవి అనే వ్యక్తి సీతఫల్ మండి లో వినాయకుణ్ణి పెట్టడం అక్కడికి మనోజ్ ను ఆహ్వానించడంతో మనోజ్, మౌనిక ఇద్దరు అక్కడ ప్రత్యేక పూజలు చేయించుకోడానికి రావడంతో అందరి దృష్టి ఈ జంట మీద పడింది. ఇప్పటికే మంచు మనోజ్ ఒక పెళ్లి జరిగి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. అయితే మౌనిక కూడా పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఇక మౌనిక కు ఒక కుమారుడు ఉన్నాడు. ఇక వీరి పెళ్ళికి మంచు కుటుంబం ఒప్పకుందా పెళ్లి ఎపుడు చేసుకుంటారు వంటి విషయాలను మాజీ ఎమ్మెల్యే గొనె ప్రకాష్ రావు మాట్లాడారు.

వాళ్లకు మొదటి పెళ్లప్పుడే పరిచయం….
మంచు కుటుంబానికి, భూమా కుటుంబానికి ముందు నుండి పరిచయాలు ఉన్నాయి. మనోజ్, మౌనికలు ఎప్పటినుండో పరిచయం ఉన్నవాళ్లు. మొదట్లోనే వీళ్లిద్దరు ప్రేమించుకున్నారు. అయితే వీళ్ళ పెళ్ళికి భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వ్యతిరేకించారు. ఇక మనోజ్ ప్రణీత రెడ్డి ని, మౌనిక గణేష్ రెడ్డి ని పెళ్లి చేసుకుని అధికారికంగా విడిపోయారు. ఇక ఇప్పుడు ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.

ఇన్నిరోజులు చెన్నై లో ఉన్నారు, ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చారు. ఇక మంచు కుటుంబానికి మనోజ్ మౌనిక ల పెళ్ళికి అభ్యంతరాలు లేవు. మనోజ్ వాళ్ళ కుటుంబాన్ని ఒప్పించాడు. అన్ని సర్దుకున్నాయి కాబట్టే ఇద్దరు జంటగా గణపతి దర్శనానికి వచ్చారు. ఇక మంచి రోజు చూసుకుని వాళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారు అంటూ గొనె ప్రకాష్ రావు గారు మనోజ్ మౌనిక విషయంలో క్లారిటీ ఇచ్చారు.






























