ప్రస్తుత కాలంలో రోజురోజుకు అధికమవుతున్న సమస్యలు మధుమేహ సమస్య ఒకటి. రోజురోజుకు మధుమేహంతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తో పాటు, వివిధ రకాల ఫంగస్ లు ఎక్కువగా డయాబెటిస్ పేషెంట్లను టార్గెట్ చేస్తున్నాయి. వీరిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం చేత తొందరగా ఇటువంటి వ్యాధుల బారిన పడుతున్నారు.

ప్రస్తుత కాలంలో మన జీవన విధానంలో,ఆహార శైలిలో అధిక మార్పులు చోటు చేసుకోవడం వల్లే ఈ విధంగా డయాబెటిస్ సమస్య వెంటాడుతోంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా డయాబెటిస్ బారిన పడిన వారు ఏ మాత్రం వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించకపోతే మన శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగే తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. కనుక చక్కెరవ్యాధి సమస్యతో బాధపడేవారు తరచూ కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

  • మధుమేహ సమస్య తో బాధపడే వారు నిత్యం ఒకే చోట కూర్చుని పని చేయకుండా వారి శరీరానికి శ్రమ కల్పించేలా చూసుకోవాలి. ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు నడవడం, శరీర వ్యాయామాలు చేయాలి.
  • ఈ మధుమేహ సమస్యతో బాధపడేవారు మధుమేహం వచ్చిందని భావించి పూర్తిగా అన్నం తినడం మానేస్తారు. ఈ విధంగా చేయడం పూర్తిగా తప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం చపాతీలు వంటి వాటిని మాత్రమే కాకుండా వాటితో పాటు కొంత పరిమాణంలో అన్నం తీసుకోవాలి.
  • ఈ మధుమేహ సమస్యతో బాధపడేవారు ఎక్కువగా తీపి పదార్థాలకు దూరంగా ఉండడం ఎంతో మంచిది.అదే విధంగా మీరు ఆహారం తీసుకునేటప్పుడు అధిక మొత్తంలో ఒకేసారి కాకుండా కొంత పరిమాణంలో ఎక్కువసార్లు తీసుకునేలా చూడాలి.
  • మధుమేహంతో బాధపడే వారు పాలిష్ పట్టని బియ్యాన్ని వండుకుని తినాలి.ఈ విధమైనటువంటి బియ్యాన్ని తీసుకుంటూనే చిరు ధాన్యాలు రాగులు జొన్నలు సజ్జలు వంటి వాటిని కూడా తీసుకోవాలి.

*మధుమేహంతో బాధపడేవారు ఎక్కువగా తాజా కూరగాయలు పండ్లు ఆకుకూరలు తీసుకోవాలి. ఈ విధమైన సమస్యతో బాధపడే వారు ఎప్పుడూ కూడా ఉపవాసాలు అంటూ ఖాళీ కడుపుతో ఉండకూడదు.
ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా మన శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here