ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇంధన సర్దుబాటు ఛార్జీలను ( ట్రూ-అప్ ఛార్జీలను)నవంబర్ నెలలో వసూలు చేశారు. వాటిని డిసెంబర్ లో వచ్చే బిల్లులో నవంబర్ నెలకు సంబధించి రిఫండ్ ఛార్జీలను సర్దుబాటు చేసి.. డిసెంబర్ లో బిల్లులను వినియోగదారులకు పంపిస్తామన్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేసిన ట్రూ-అప్ ఛార్జీలను తిరిగి చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి డిస్కమ్‌లకు కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. డిస్కమ్‌లు ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వినియోగదారుల నుండి మొత్తం సేకరించాయి.
మెజారిటీ సంస్థలు, సంఘాలే కాకుండా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు ట్రూ-అప్ ఛార్జీల వసూలును వ్యతిరేకించాయి. కోవిడ్ సంక్షోభం కారణంగా ప్రజలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఎత్తి చూపుతూ వారు APERCకి అభ్యర్థనలను సమర్పించారు. ట్రూ-అప్ ఛార్జీలను వసూలు చేసే ఆలోచనను విరమించుకోవాలన్నారు.
దీనిలో భాగంగానే.. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో నవంబర్ నెల బిల్లుల నుంచే ట్రూ అప్ ఛార్జీలను వినియోగదారులకు తిరిగి వెనక్కి చెల్లిస్తూ సర్దుబాటు ప్రక్రియ ప్రారంభించారు. ఏపీఈపీడీసీఎల్ డిసెంబర్ నుంచి చేపట్టింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 1.86 కోట్ల మంది వినియోగదారులకు ఊరట లభించింది. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిహెచ్. బాబురావు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. తమ కృషికి మంచి ఫలితాలు వచ్చాయన్నారు.

































