ఇండియన్ రైల్వే ప్రయాణికులకు మరి కొన్ని సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్లాట్‌ఫామ్ టికెట్లు, అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు కొనుగోలుకు ఇటీవల స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటికి రిచార్జ్ చేయడానికి ఎక్కడికో వెళ్లాల్సిలిన అవసరం లేదని రైల్వే అధికారులు తెలిపారు. ఎందుకంటే.. ఇకనుంచి వాటి రీచార్జ్ ను ఆన్‌లైన్‌లో చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

దీని కోసం యూజర్లు తమ మొబైల్ నుంచి సెర్చింగ్ దిగ్గజం గూగుల్ వెళ్లి.. అందులో UTSonmobile అని టైప్ చేయాలి. అందులో UTSonmobile వెబ్ పోర్టల్ లోకి వెళ్లి రిజస్టర్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. టికెట్లను ప్రతి ఒక్కిరికీ అందుబాటులో ఉండే విధంగా.. క్యూలైన్లను తగ్గించాలనే ఉద్దేశ్యంతో అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా కొనే సదుపాయాన్ని ఇంతకు ముందు నుంచే ఉంది.
దీనిని కూడా రైల్వే ప్రయాణికులు ఉపయోగించుకోవాలని సూచించింది. ఇక స్మార్ట్ కార్డు రీచార్జ్ కోసం డెబిట్, క్రెడిట్ కార్డులను కూడా ఉపయోగించి చేసుకోవచ్చని తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో.. ఈ విధమైన సేవలను అందుబాటులోకి తెచ్చారు.
UTSonmobile వెబ్ పోర్టల్ కి వెళ్లి.. అందులో స్మార్ట్ కార్డు రీచార్జ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి.. మన కార్డు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అందులో మనం ఎంత అమౌంట్ రీచార్జ్ చేయాలో సెలెక్ట్ చేసుకొని.. ఆ మొత్తాన్ని ఎంటర్ చేయాలి. తర్వాత చిన్నపాటి స్టెప్స్ లతో.. పేమెంట్ మోడ్ ను సెలెక్ట్ చేసుకొని రీచర్జ్ చేసుకోవచ్చు.































