CM KCR-Farmers: తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతులకు రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలతో ముందుకు సాగుతోంది. రైతుబీమాతో ఒకవేళ రైతు మరణిస్తే అతడి కుటుంబసభ్యుల్లోని నామినీకి రూ.5లక్షలు ఇవ్వనున్నారు. దీనికి ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం ప్రతీ సంవత్సరం దానికి సంబంధించిన ప్రీమియాన్ని చెల్లిస్తుంది.

ఇక రైతు బంధు విషయానికి వస్తే భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం కింద సాయం చేస్తోంది.
ఎకరం పొలం ఉన్న రైతులకు రెండు దఫాలకు ఐదు వేల చొప్పున రూ.10 వేలు రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు. తాజాగా మరో శుభవార్తను అందించింది కేసీఆర్ ప్రభుత్వం.

రైతులకు పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే బడ్జెట్‌లో ఈ స్కీమ్ ప్రకటించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఎక్సర్‌సైజ్ మొదలు పెట్టింది. దీనికి సంబంధించి పథకాన్ని సీఎం కేసీఆర్ కొండపోచమ్మసాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా రైతులకు గుడ్ న్యూస్ చెప్తానని వెల్లడించారు.
పలు కారణాలతో ఆ హామీ అలాగే మిగిలిపోయిందని.. రైతుబంధు, రైతుబీమాలకు తోడుగా అన్నదాతల కోసం ఈ స్కీం తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు ప్రభుత్వవర్గాలు పలు సందర్భాల్లో వెల్లడించాయి.
రైతులకు నెలకు రూ.2016 ఫిచన్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రైతు పింఛన్ విధివిధానాలు ఖరారు చేసే పనిలో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నిమగ్నమైంది.
చిన్న, సన్న కారు రైతులకు..
చిన్న, సన్న కారు రైతులకు రూ.2016 పింఛన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారని.. రైతుకు 47 ఏల్లు నిండాలని పేర్కొన్నారు. 50 ఏళ్లు నిండిన గీత కార్మికులకు పింఛన్ ఇప్తున్న ప్రభుత్వం.. ఆ కార్మికుల కంటే వయోపరిమితి రెండేళ్లు తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే 47 ఏళ్లు వయస్సు పరిమితి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట ఎందుకంటే.. రాష్ట్రంలో రైతుబంధు పొందుతున్న రైతులు 67 లక్షల పైచిలుకు ఉన్నారు. వీరిలో 47 ఏళ్లు నిండిన వాళ్లు ఎంత మంది ఉన్నారు..? 49 ఏళ్లు నిండిన వాళ్లు ఎంతమంది ఉన్నారనే లెక్కలు తీస్తున్నారు. ఫైనల్ గా 47 ఏళ్లు నిండి ప్రతీ రైతుకు పింఛన్ ఇచ్చే ఆలోచన ఉన్నట్లు సమాచారం. మూడెకరాల నుంచి ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు పింఛన్ ఇచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి సమగ్ర సమాచారం.. బడ్జెట్ లో ప్రవేశపెట్టేందుకు అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.




























