దేశంలో సామాన్య ప్రజల నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణాన్ని ఎంతో ఇష్టపడతారు. బస్సు, విమాన ప్రయాణాలతో రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణం కావడంతో పాటు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. రైలు ప్రయాణికులు రైలు టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

వేరే విధంగా కూడా రైలు టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువ మంది ప్రయాణికులు ఈ విధానం ద్వారానే టికెట్లను బుక్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే తాజాగా దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైలు ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఐఆర్సీటీసీ ఎస్బీఐ రూపే కార్డ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డ్ ద్వారా ప్రయాణికులు సులువుగా టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మోదీ సర్కార్ గత కొన్ని నెలల నుంచి మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాలను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మన దేశానికి చెందిన కార్డ్ అయిన రూపే కార్డ్ తో నిబంధనల ప్రకారం ఫ్రీగా టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది. ఎన్పీసీఐ – ఎస్బీఐ ఐఆర్సీటీసీ సంయుక్తంగా ఈ కార్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాయి.

ప్రయాణికులు ఎవరైతే ఎస్బీఐ ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చిన రూపే కార్డును వినియోగిస్తారో వాళ్లు ఉచితంగా లేదా తక్కువ ధరకే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ కార్డ్ తో పెట్రోల్, డీజిల్ పై దేశంలోని అన్ని బంకుల్లో ఒక శాతం ఛార్జీల మినహాయింపును పొందవచ్చు. ఒకే ట్యాప్ తో ఫ్లాట్ ఫాం, మెట్రో, టోల్ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ కార్డ్ ద్వారా వినియోగదారులు పలు ఈ కామర్స్ లైట్లలో డిస్కౌంట్లను కూడా పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here