బీటెక్ చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్.. గూగుల్ బంపర్ ఆఫర్..!

0
254

ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇంజనీరింగ్ ఇంటర్న్ సమ్మర్ 2021 పేరుతో బీటెక్ గ్రాడ్యుయేట్స్ కు ఇంటర్న్ షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆసక్తి ఉన్న బీటెక్ ఫైనలియర్ విద్యార్థులు ఈ ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తైన తరువాత ఇంటర్న్ షిప్ కోసం ఎదురు చూస్తారు.

అయితే గూగుల్ ఆఫర్ చేసిన ఇంటర్న్ షిప్ లో చేరితే మాత్రం లైఫ్ మారిపోయే ఛాన్స్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విద్యార్థులు ఈ ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకటి కన్నా ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిసి ఉండి ప్రోగ్రామింగ్ పై ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఇంటర్న్ షిప్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జావా, సీ, సీ ++, స్ప్రింగ్, హైబర్ నేట్, పైథాన్ లాంటి కోర్సులు వచ్చిన వాళ్లు ఈ ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మూడు నెలల నుంచి మూడున్నర నెలల పాటు ఉండే ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కు ఎంపికైన బీటెక్ విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ ను డెవలప్ చేయాలి. ఇప్పటికే ఇంటర్న్ షిప్ కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 11 డిసెంబర్ 2020 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఎంపికైన విద్యార్థులు బెంగళూరు, హైదరాబాద్ గూగుల్ క్యాంపస్ లలో ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది.

ఆసక్తి ఉన్న విద్యార్థులు https://careers.google.com/jobs/results/89086682550149830-application-engineering-intern-summer-2021/ లింక్ ద్వారా ఇంటర్న్ షిప్ కు సంబంధించిన పూర్తివివరాలను తెలుసుకోవచ్చు. గూగుల్ లో ఇంటర్న్ షిప్ చేస్తే భారీ ప్యాకేజీతో ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here