Good News: కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు, సొంత ఇల్లు లేని వారికి శుభవార్త చెప్పింది. దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతూ వస్తున్నా.. రేషన్ కార్డు, ఇల్లు లేని వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ఇలాంటి వాళ్లు మన చుట్టు ఎంతో మంది ఉన్నారు. వీరికి మేలు జరిగే విధంగా కేంద్రం చర్యలు చేపట్టింది.

ఎలాంటి సబ్సిడీ లేకుండా.. ఆహార ధాన్యాలు ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుంది. అలాంటి వారి డేటాను సేకరించే పనిలో పడింది. ఇదిలా ఉండగా.. దేశంలో రేషన్ కార్డు ఉన్నవాళ్లకు కేజీకి రూ.1 నుంచి రూ. 3 ధరతో ధాన్యాలు లభిస్తున్నాయి. అయితే చాలా మంది రేషన్ కార్డు లేకుండా.. ఇల్లు లేని వాళ్లు చాలామంది ఉన్నారు.

81 కోట్ల మందికి రేషన్ కార్డు ఉండగా.. మిగిలిన 1.6 కోట్ల మంది ఆ ధాన్యాలు పొందలేకపోతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నా యోజన కింద ఈ సంవత్సరం మార్చి 31 వరకు ఈ ప్రయోజనాన్ని రేషన్ కార్డు లేని వారికి కూడా కల్పించారు.
ఇల్లు లేని నిరాశ్రయులకు మేలు..
తాజా సమాచారం ప్రకారం ఈ సంవత్సరం మార్చి నెల చివరి వరకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఇల్లు లేని వారికి, రేషన్ కార్డు లేదా అడ్రస్ ప్రూఫ్ లేని వారికి ఈ ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఇల్లు లేని నిరుపేదలు అందరి వివరాలు సేకరిస్తోంది కేంద్రం. ఈ కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. 1.6 కోట్ల మందిని ఎన్ఎఫ్ఎస్ఏ కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది. ఇల్లు లేని వారు నిరాశ్రయులు, సరైన ఐడెంటిటీ కార్డు లేదా అడ్రస్ ప్రూఫ్ లేని వారు సబ్సిడీ రేటు ఆహార ధాన్యాలు లేదా ఉచిత బియ్యాని ఈ విధానం ద్వరా పొందొచ్చు.



























