సాధారణంగా కారు, బైక్, స్కూటర్ కొనుగోలు చేయాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా 1800 రూపాయలకే కారు లేదా బైక్ ను కొనుగోలు చేసే అవకాశం ఉందంటే చాలామంది అందులో ఏదైనా మోసం ఉంటుందని భావిస్తారు. అయితే ప్రముఖ గ్రాసరీ ఫ్లాట్ ఫామ్ గ్రోఫర్స్ మాత్రం కేవలం 1800 రూపాయలు ఖర్చు చేసి గ్రాసరీలను కొనుగోలు చేయడం ద్వారా కారు గెలుపొందే అవకాశం కల్పిస్తోంది.

గ్రాండ్ ఆరెంజ్ బ్యాగ్ డేస్ పేరుతో గ్రోఫర్స్ కారును ఉచితంగా ఇంటికి తీసుకెళ్లే అవకాశం కల్పిస్తోంది. అయితే అదృష్టవంతులు మాత్రమే ఈ ఆఫర్ ద్వారా కారును పొందే అవకాశం ఉంటుంది. ఈ నెల 18వ తేదీ నుంచి గ్రోఫర్స్ గ్రాండ్ ఆరెంజ్ బ్యాగ్ డేస్ సేల్ ప్రారంభం కానుండగా జనవరి 26వ తేదీ వరకు ఈ సేల్ ఉంటుంది. కనీసం 1800 రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన వస్తువులపై రివార్డ్ లభిస్తుంది.

ఆన్ లైన్ లో గ్రాసరీ సరుకులను ఆర్డర్ చేయడం ద్వారా కుక్కర్లు, మిక్సీలు, స్మార్ట్ ఫోన్ లు, ఫ్రిజ్ లు, వాషింగ్ మెషిన్లు, స్కూటర్లు, కార్లను గెలుపొందే అవకాశం ఉంటుంది. మీకు లక్ ఉంటే మీరు కూడా కచ్చితంగా కార్ లేదా స్కూటర్ ను గెలుపొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. గ్రోఫర్స్ కొన్ని బ్యాంకుల కార్డులపై క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తూ ఉండటం గమనార్హం.

రేపటి నుంచి ఈ సేల్ ప్రారంభం కానుండగా ఆసక్తి ఉన్న కస్టమర్లు గ్రోఫర్స్ వెబ్ సైట్ ద్వారా షాపింగ్ చేసి రివార్డులను గెలుపొందవచ్చు. ఎటువంటి ప్రోమో కోడ్ అవసరం లేకుండానే ఈ ఆఫర్ కు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. గ్రోఫర్స్ వెబ్ సైట్ ద్వారా ఈ సేల్ కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here