Gulabi Movie: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువ అయినప్పటికీ అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇలా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం గులాబీ.కృష్ణవంశీ రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో ఆయనలో ఉన్న టాలెంట్ గుర్తించిన వర్మ తన సొంత బ్యానర్ లోనే కృష్ణవంశీ ఫస్ట్ సినిమాని నిర్మిస్తానని మాట ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారమే వర్మ బ్యానర్ లో కృష్ణవంశీ దర్శకుడిగా తన డెబ్యూ మూవీ గులాబీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.జెడి చక్రవర్తి మహేశ్వరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ సస్పెన్షన్ చిత్రం గులాబీ అప్పట్లో సెన్సేషనల్ అయింది. 1995 నవంబర్ మూడవ తేదీ ఈ సినిమా విడుదల అయ్యి అద్భుతమైన రికార్డులను సృష్టించింది.
ఈ సినిమా 2022 నవంబర్ మూడవ తేదీకి 27 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం విశేషం.ఇక ఈ సినిమా హిట్ అవడంతో ఒకవైపు దర్శకుడికి అలాగే నటీనటులకు ఇతర టెక్నీషియన్లకు ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతమ్, సింగర్ సునీత. ఈ సినిమాలో సునీత పాడినటువంటి మొట్టమొదటి పాట ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనే పాట సూపర్ డూపర్ హిట్ అయింది.

Gulabi Movie: సునీత జీవితాన్ని మార్చేసిన గులాబీ..
ఈ పాట ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి సునీత మొదటి పాటతోనే అద్భుతమైన ఆదరణ సంపాదించుకోవడంతో ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఇలా సునీత జీవితాన్ని మార్చేసిన సినిమా గులాబీ అని చెప్పాలి. ఇప్పటికీ ఈ పాట ఎంతోమందికి ఫేవరెట్ సాంగ్ గా మిగిలిపోయింది. గులాబీ సినిమా ద్వారా ఈ సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్లు అందరూ కూడా మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
































