సినిమా స్టార్స్ అంటే అభిమానులకు కొదవలేదు. ఒకసారి వాళ్ళకి నచ్చిన హీరోను అభిమానించారంటే ప్రాణం పోయేదాకా వాళ్ళ మీద ఉన్న ఇష్టం తగ్గదు. వాళ్ళకి నచ్చిన హీరోలు ఏం చేసిన అది ఒక ట్రెండ్ గా మారిపోతుంది. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ చేస్తే చాలు నిమిషాల్లో లక్షల కొద్దీ వ్యూస్, లైక్స్ వస్తాయి. అలాగే తాము ఎంతగానో అభిమానించే అభిమాన హీరో తిండి అలవాట్లు, వాడే కార్స్, బైక్స్, వేసుకునే బట్టలు ఇవన్నీ కూడా అభిమానులు ఫాలో అవుతుంటారు. అంతెందుకు ఆ హీరో సినిమాలో వేసుకున్న బట్టలు ట్రెండ్ గా మారిపోతాయి. మరుసటి రోజున అభిమానులు అచ్చం అలాంటి బట్టలే వేసుకుని మురిసిపోతారు. అలాగే హీరో పెట్టుకున్న వాచ్ దగ్గర నుండి హెయిర్ స్టైల్ వరకు అన్ని తెలుసుకుని అచ్చం వాళ్ళ లాగా అనుకరిస్తుంటారు కూడా.

అంతగా మీరు అభిమానించే హీరో యొక్క సంతకం ఎలా పెడతాడతారో మీరు తెలుసుకున్నారా.. హీరోలు ఆటోగ్రాఫ్స్ లాంటివి ఇచ్చేప్పుడు తప్ప హీరోస్ చేసిన ఒరిజినల్ సంతకాలు బయట ఎవరికీ తెలియవు. మరి మీ అభిమాన స్టార్ హీరోస్ సంతకాలు ఎలా పెడతారో తెలుసుకోండి.. !!

మొదటగా అందరు ఎంతగానో ఎదురుచూసే మెగాస్టార్ చిరంజీవి గారి సంతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి.. మెగాస్టార్ చిరంజీవి జీవితంలో ఎన్నో సాధించి, ఒక గొప్ప స్థాయిలోకి వచ్చారు. అయన కెరీర్ లాగానే అయన చేసే సంతకం చాడ చాలా పొడవుగా ఉంది కదా.. !!

తరువాత ఎవరి పేరు చెబితే శత్రువుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయే ఆయనే బాలయ్య బాబు. ఆయన గాంబీర్యం లాగేనే బాలకృష్ణ సంతకం కూడా గుండెల్లో ఒణుకు పుట్టించేలాగా గుబేల్ అంటుంది కదా.. !!

ఇకపోతే మన్మధుడు నాగార్జున సంతకం చూస్తే ఆయనలాగానే అందంగా, ఎంతో ఎంత క్యూట్ గా ఉందో మీరే చుడండి..

ఇకపోతే ప్రిన్స్ మహేష్ బాబు అంటే అటు అమ్మాయిలకు, ఇటు అబ్బాయిలకు ఎంత ఇష్టమో చెప్పలేము. మహేష్ బాబు నవ్వితే చాలు అమ్మాయిలు అలా పడిపోవాలిసిందే మరి.. అందుకేనేమో ప్రిన్స్ సంతకం కూడా ఆయన లాగానే నవ్వుతున్నట్లు ఉంది కదా.. !!

తరువాత సంతకం ఎవరిదంటే విక్టరీ వెంకటేష్ ది. వెంకీ సంతకం ఒక పట్టాన ఎవరికీ అర్ధం కావడం లేదు. మరి ఆయన స్టయిలే వేరు కదా.. !!

ఇకపోతే సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన స్టైల్ గురించి వేరే చెప్పన్నక్కర్లేదు..రజిని డైలాగ్ చెప్పిన, డాన్స్ వేసిన ఒక స్టైల్ మైంటైన్ చేస్తాడు. అలాగే ఆయన సంతకం విషయంలో కూడా ఒక స్టైల్ లో ఉంది కదా.. ఎంతయినా నేషనల్ స్టార్ కదా. మరి ఆయన సంతకం కూడా ఆ రేంజ్ లో ఉంటేనే బాగుంటుంది మరి.

మనం అందరం ఎంతగానో అభిమానించే హీరో పవన్ కళ్యాణ్. ఆయన అయన మనస్తత్వం లాగానే ఆయన సంతకం కూడా కనిపిస్తుంది కదా. ఆయన అంటే ఏంటో మన అందరికి బాగా తెలుసు. అందుకేనేమో ఆయన సంతకాన్ని కూడా అందరికి అర్ధం అయ్యేలాగా పెడతారనుకుంట.

ఇక ప్రభాస్ సంతకం విషయానికి వస్తే బాగా రిచ్ పీపుల్ లెవెల్ లో ఉంది కదా… ఎంత అయిన పెద్దోళ్ల సంతకాలు ఇలానే పెద్దగా ఉంటాయనుకుంటా.

ఇప్పుడు మనం చూడబోయే సంతకం ఎవరిదో తెలిస్తే కంట నీళ్లు వస్తాయి.పేరులో ఉదయం అని ఉంది కానీ, చిన్నవయసులోనే అస్తమించిన హీరో ఉదయ్ కిరణ్ సంతకం.. భద్రంగా దాచుకోండి. ఇక ఎప్పటికి ఎవరు పెట్టడానికి కుదరనిది కదా..

ఇంకా మన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సంతకం తెలియని వారు ఉండరు. ఆయన సంతకంలోనే ఆయన స్టైల్, పేరు రెండు కనిపిస్తున్నాయి కదా..

ఇంకా చిరంజీవి తనయుడు అయినా రామ్ చరణ్ తేజ్ సంతకం విషయానికి వస్తే ఆయన లాగానే చాలా సింపుల్ గా క్యూట్ గా ఉంది కదా..! ఎంత మెగాస్టార్ కొడుకు అయినా గాని ఎంత సింపుల్ గా ఉంటాడో అలానే చెర్రీ సంతకం కూడా అంతే సింపుల్ గా ఉంది మరి..

చూసారు కదా మీ అభిమాన హీరోల సంతకాలు.. మరి జరా భద్రంగా దాచుకోండి.. !!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here