Hansika Motwani: హన్సిక బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా దేశముదురు సినిమా తర్వాత ఈమెకు తెలుగు తమిళ భాషలలో కూడా అవకాశాలు వచ్చాయి.

ఈ విధంగా తెలుగు తమిళ భాషలలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఇలా పెళ్లి చేసుకున్నప్పటికీ తనకు సినిమా అవకాశాలు రావడంతో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె బాలీవుడ్ డిజైనర్స్ వద్ద తాను ఎదుర్కొన్న అవమానాలను తెలియజేశారు. తాను సౌత్ ఇండస్ట్రీకి చెందిన నటి అనే విషయం తెలియడంతో బాలీవుడ్ డిజైనర్స్ తనకు దుస్తులు ఇవ్వడానికి కూడా వెనకడుగు వేసే వాళ్ళని బట్టలు ఇవ్వమంటూ తనని ఘోరంగా అవమానించారని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.

Hansika Motwani: ఇప్పుడు బ్రతిమలాడుతున్నారు…
ఈ విధంగా తనను అవమానించినప్పటికీ తాను ఫీల్ కాలేదని తన ప్రతిభను నిరూపించుకొని తానేంటో తెలియజేయాలని ఇండస్ట్రీలో కష్టపడి పని చేశాను అయితే నా ప్రతిభను గుర్తించిన ఆ బాలీవుడ్ డిజైనర్స్ ఇప్పుడు నా వద్దకు వచ్చి తమ డిజైనర్ దుస్తులను తనకు వేసుకోవాలని బ్రతిమలాడుతున్నారు అంటూ ఈ సందర్భంగా హన్సిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
































