Hanuman: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించినటువంటి తాజా చిత్రం హనుమాన్ ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇలా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 278 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైం రికార్డ్ సృష్టించడమే కాకుండా సంక్రాంతికి విడుదలైనటువంటి సినిమాలలో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమాకు ఇంత మంచి ఆదరణ రావడంతో చిత్ర బృందం తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ సినిమా మరొక అరుదైన రికార్డును కూడా సాధించింది.
92 సంవత్సరాల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు సంక్రాంతి పండుగకు విడుదలైనటువంటి ఏ సినిమా కూడా ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు అలాంటి కలెక్షన్స్ రాబట్టినటువంటి ఏకైక మొదటి సినిమాగా హనుమాన్ సినిమా రికార్డు సృష్టించడం గమనార్హం. ఇదే విషయాన్ని మేకర్ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.
హనుమంతుడిగా చిరంజీవి..
ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సీక్వెల్ జై హనుమాన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరంజీవి హనుమంతుడి పాత్రలో నటించవచ్చు అంటూ డైరెక్టర్ చేసిన కామెంట్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నాయి.




























