కర్ణాటకలోని కృష్ణ రాజ సాగర్ జలాశయానికి పగుళ్ళు ఏర్పడ్డాయని… డ్యామ్ చుట్టుపక్కల అక్రమ మైనింగ్ కారణంగానే డ్యామ్ పగుళ్ళు ఏర్పడుతోందని మాండ్య ఎంపీ, నటి సుమలత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే నటి సుమలత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆమెపై నోరుజారి తీవ్ర చిక్కుల్లో ఇరుక్కున్నారు.

కావేరి నదిపై కృష్ణరాజ సాగర్ (కేఆర్‌ఎస్) జలాశయం నుంచి నీరు లీకవుతుంటే అందుకు అడ్డుగా ఎంపీ సుమలతను పడుకోబెట్టాలని కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. జలాశయం చుట్టుపక్కల అక్రమ మైనింగ్ కారణంగా జలాశయానికి పగుళ్లు ఏర్పడుతుంటాయని సుమలతను పలుమార్లు ఆరోపించడంతో జలవనరుల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి ఎటువంటి పగుళ్లు లేవని ఆ కమిటీ తేల్చి చెప్పింది.
ఈ క్రమంలోనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ అనవసరంగా జలాశయం లీక్ అవుతుంది అంటూ సుమలత ఆరోపించడం సబబు కాదని, జలాశయంలో లీకేజ్ అవుతుంటే నీరు లీకేజీ కాకుండా ఉండాలంటే స్లూయజ్ గేట్లకు అడ్డుగా సుమలతను పడుకోబెట్టాలని నోరుజారారు. ఈ విధంగా ఒక మహిళ పట్ల బాధ్యత గల ప్రజా ప్రతినిధి అయ్యుండి ఈ విధంగా మాట్లాడటాన్ని ఎంపీ సుమలత తప్పుబట్టారు.
కుమారస్వామి ఎలాంటివారో ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అతని మాటల వల్లే తెలుస్తుందని ఆమె మాజీ ముఖ్యమంత్రి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు చేయడం తప్పు కాదు కానీ ఆ మాటలు మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని సుమలత సూచించారు. ప్రాజెక్టు సమీపంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని అక్కడ లీకేజ్ జరిగేచోట ఆయనే పడుకోబెట్టాలి అంటూ ఆమె కౌంటర్ వేశారు.

































