కాక్టస్ పండుతో ఎన్నో ఉపయోగాలు.. దీని జ్యూస్ తాగితే ఆ వ్యాధులు తగ్గుతాయి..

0
596

మనం చిన్నతనంలో చదువుకునే రోజుల్లో బ్రహ్మజెముడు అనే ఎడారి మొక్క గురించి తెలుకొనే ఉంటాం. దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా.. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా మంది వాటిని అనేక ఇళ్ళు మరియు తోటల అలంకరణలో భాగంగా ఈ రకమైన మొక్కలను ఉపయోగిస్తారు. కాక్టస్ మొక్క పండ్ల నుంచి జ్యూస్ లాంటిది తయారుచేస్తారు.

దాన్నే కాక్టస్ వాటర్ అని పిలుస్తున్నారు. కాక్టస్ వాటర్ అనేది ప్రస్తతం ఆన్ లైన్ లో కూడా అమ్ముతున్నారు. దీని ధర ఒక్క బాటిల్ వచ్చేసి రూ.200 నుంచి రూ.300 వరకు ఉంటుంది. ఇవి టెట్రప్యాకెట్ రూపంలో కూడా లభిస్తుంది. ప్రస్తుతం కొబ్బరి నీళ్లు, అలో వెరా జ్యూస్ లాగా… కాక్టస్ వాటర్ కూడా చాలా ఫేమస్ అవుతోంది. కాక్టస్ పండ్లు పింక్ కలర్ లో ఉంటాయి.

అయితే వాటి నుంచి తీసే జ్యూస్ కూడా పింక్ కలర్ లోనే ఉంటాయి. దీనిలో ఎక్కువ పోషకాలు, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కేలరీల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటాయి. దీనిని ఎక్కువగా అథ్లెట్లు వాడుతారు. ఎందుకంటే దీనిలో ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. కాక్టస్ ను ఎక్కువగా చర్మ సంబంధిత ప్రోడక్ట్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. దీనిలో పొటాషియం వల్ల కండరాలకు ఎంతో ఉపయోగపడుతుంది.

వాటిని బలంగా చేసేందుకు దోహదనపడతాయి. అంతే కాకుండా గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తి కూడా దీని వల్ల పెరుగుతుంది. టైప్ 2 డయాబెటిస్ తగ్గించడంలో కాక్టస్ వాటర్ బాగా పనిచేస్తుంది. మలబద్దకంతో బాధపడే వారకి ఇది నివారిణిగా కూడా ఉపయోగపడుతుంది. ఇలా బ్రహ్మజెముడు పండు నీరును ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.