కాక్టస్ కుటుంబానికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతం మార్కెట్లలో ఎరుపు, పసుపు, గులాబీ వంటి ఆకర్షణీయ రంగుల్లో లభ్యమవుతున్నాయి. కానీ మనకు గులాబీ రంగులో ఉండే డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా అందుబాటులో ఉంటుంది.లోపల తెల్లటి గుజ్జు అందులో నల్లటి విత్తనాలతో కొద్దిగా పుల్లగా, కొద్దిగా తీపిగా ఉండే ఈ పండ్లలో మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి.

100 గ్రాముల డ్రాగన్ ఫ్రూట్ లో దాదాపు 268 కేలరీలు,ఐరన్, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ తదితర విలువైన పోషకాలు లభిస్తాయి.అందువల్ల మన సంపూర్ణ ఆరోగ్యానికి ఈ పండ్లు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇందులో ఒమేగా 3 మరియు ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడి ఊబకాయం వంటి సమస్యలను దూరం చేస్తుంది
డ్రాగన్ ఫ్రూట్‌లో నేచురల్ గా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను, క్యాన్సర్, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తాయి. ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడంతో జీర్ణక్రియ సమృద్ధిగా జరిగి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అధిక కార్బోహైడ్రేట్స్ కారణంగా తక్షణ శక్తిని ఇచ్చి ఒత్తిడి, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుంది.ఇలా ఎన్నో రకాలుగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్న డ్రాగన్ ఫ్రూట్ కాస్త ధర ఎక్కువ అప్పటికి ప్రజలు వీటిని ఆహారంలో చేర్చుకోవడానికే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు.































