నవధాన్యాల్లో జొన్నలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా జొన్న రొట్టెలు, జొన్న పిండితో చేసిన ఇతర వంటకాలు తెలుగు వారికి అత్యంత ప్రియమైన వంటకాలు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే జొన్నలను ఆహారంగా ఎక్కువగా వాడేవారు. ప్రస్తుతం జొన్నల ప్రాముఖ్యత గుర్తించి ప్రతి ఒక్కరూ వాడటానికి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం జొన్న రొట్టెలు అత్యంత ఖరీదైన వంటకం.కొన్ని రెస్టారెంట్లు జొన్న రొట్టెలు, నాటుకోడి మాంసంతో ఆహారప్రియులను ఆకర్షిస్తున్నాయి.

జొన్న ధాన్యంలో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు.
జొన్నల్లో ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. జొన్న ధాన్యం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….జొన్నల్లో ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఎక్కువగా ఉంటాయి కావున జొన్న రొట్టెలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు, కీళ్ల సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.అలాగే శరీరానికి అవసరమైన ప్రొటీన్లు,విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించి రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.
ప్రతి రోజూ జొన్న రొట్టెలు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరంలో వున్న అనవసరపు కొవ్వు క్రమంగా కరిగి శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండి మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది.
కావున ప్రతి రోజు మన డైట్ లో జొన్నరొట్టెలను చేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.


































